సోదరుని పెళ్ళి వీడియో షేర్ చేసిన కంగనా

బాలీవుడ్ బ్యూటీ కంగనారనౌత్ సోదరుడు అక్షయ్ రనౌత్ పెళ్లి రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఘనంగా జరిగింది. ఈ పెళ్లికి సంబంధించిన పనులన్నింటిని కంగనా దగ్గరుండి చూసుకుంది. కరోనా వలన కేవలం కొద్ది మంది కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరు కాగా, వేడుకకి సంబంధించిన అప్‌డేట్స్‌ని ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ వచ్చింది.

తాజాగా పెళ్లికి సంబంధించిన వీడియోని షేర్ చేసింది కంగనా. ఈ వేడుక జీవితంలో ఎప్పటికీ నిలిచిపోతుందని పేర్కొంది. పెళ్ళిలో కంగనా బ్లూ కలర్ లెహంగాలో మెరవగా, దీనిని తయారు చేసేందుకు 14 రోజులకు పైగా సమయం పట్టిందట.