జనసైనికుడు కనుకుర్తి ఆదిత్యకు అండగా నిలచిన జనసేన

నల్గొండ: నల్గొండకు చెందిన జనసైనికుడు కనుకుర్తి ఆదిత్య గురువారం యాక్సిడెంట్ కు గురై నల్గొండ సికే హాస్పిటల్ నందు ఆదిత్యకు ఆపరేషన్ జరిగింది. విసయం తెలుసుకున్న జనసేన నల్గొండ ముఖ్య నాయకులు కాంపల్లి వెంకట్ పున్నం రాంబాబుతో పాటు నకిరేకల్ నియోజకవర్గం ఇంచార్జ్ చెరుకుపల్లి రామలింగయ్య జనసైనికుని ఇంటికి వెళ్లి ఆదిత్యను పరామర్శించడం జరిగింది. అదేవిధంగా క్రియాశీలక సభ్యత్వం పొందిన జనసైనికుడికి ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళతో మాట్లాడి వారికి మెడికల్ బిల్లు మంజూరు చేయించాలని కోరడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన పార్టీ కార్యకర్తలకు ఎప్పుడు అండగా ఉంటుందని తెలియచేయడం జరిగింది.