కన్నులపండుగలా బొనెల విజయచంద్ర నామినేషన్

పార్వతీపురం నియోజకవర్గం: ఎన్.డి.ఏ కూటమి ఉమ్మడి అభ్యర్థి బొనెల విజయచంద్ర నామినేషన్ కన్నుల పండుగలా పార్వతీపురం నియోజకవర్గంలో జరిగింది. ఈ నామినేషన్కి జనసేన పార్టీ పార్వతీపురం మండల టీమ్ మండల అధ్యక్షురాలు అగూరు మణి అధ్యర్యంలో పార్వతీపురం బెలగం నుంచి పార్వతీపురం పాత బస్టాండ్ వరకు జరుగు జగన్ జరుగు జగన్ – కుర్చీ ఖాళీ చేయు జగన్, హలో ఏపీ – బై బై వైసీపీ, విజయచంద్ర గారి నాయుకత్వం వర్ధిల్లాలి అంటూ ఉత్సాహంగా నినాదాలు చేస్తూ పార్వతీపురం మండలంలో వివిధ గ్రామంలో వున్నా జనసేన పార్టీ నాయుకులు, వీరమహిళలు, జనసైనికులతో ర్యాలీగా వెళ్లి ఉమ్మడి అభ్యర్థి నామినేషన్ కు మద్దతు తెలిజేయడం జరిగింది.