జనసేన పార్టీకి కాపు సంక్షేమ సేన సపోర్టు

తిరుపతి: జిల్లాలో శుక్రవారం తిరుపతి ఉమ్మడి జిల్లాల జనసేన పార్టీ ఉపాధ్యక్షులు కాపు సంక్షేమ సేన రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ గౌరవనీయులు బత్తెన మధు బాబు ఆధ్వర్యంలో కాపు సంక్షేమ సేన ఎలా పని చేయాలి మరియు మానవ శరీరానికి వెన్నెముక ఎలా సపోర్టుగా ఉంటుందో, అదేవిధంగా జనసేన పార్టీకి కాపు సంక్షేమ సేన అలాగే సపోర్టుగా ఉంటుందని తెలియజేయడం జరిగింది. మరియు కాపు సంక్షేమ సేన ఆధ్వర్యంలో కొంతమందిని జిల్లా కార్యదర్శులుగా, ఉపాధ్యక్షులుగా మరియు అధ్యక్షులుగా నియమించడం జరిగింది. 2024లో పవన్ కళ్యాణ్ గారు పవన్ షేరింగ్ లో పవర్ లోకి రావాలని, ముఖ్యమంత్రిగా మేము చూడాలని మరియు తిరుపతి నియోజకవర్గం శ్రీ పవన్ కళ్యాణ్ గారు తిరుపతిలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ గారికి మేము ఎమ్మెల్యే పదవి గిఫ్ట్ గా ఇస్తాము. ఇంతకుముందు 2009లో చిరంజీవి గారిని ఎమ్మెల్యేగా గెలిపించాము, అదే రీతిలో మా ప్రాణాలను అడ్డుపెట్టి పవన్ కళ్యాణ్ గారిని తిరుపతిలో గెలిపించి అసెంబ్లీలో అడుగు పెట్టాలని కోరుకుంటున్నాము. ఈ మాట తిరుపతి ప్రజల మాట కాపు సంక్షేమ సేన రౌండ్ టేబుల్ మీటింగ్లో బత్తిన మధు బాబు ఆధ్వర్యంలో రమేష్ బాబు మారసాని, హిమవంతు రాయల్, హేమంత్ రాయల్, కొండ రాజమోహన్ రాయల్, వంశీ రాయల్, వెంకట్ రాయల్, హరి రాయల్, కిరణ్ రాయల్, ఇంకా డాక్టర్లు మరియు కాప్ సంక్షేమ సేన నాయకులు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది.