చారిత్రాత్మక సంపద కాపాడాల్సిన బాధ్యత మనందరిది: జనసేన

పిఠాపురం నియోజకవర్గ టౌన్ నడిబొడ్డున ఉన్న కుంతీ మాధవ స్వామి ఆలయ కోనేరు దేవాదాయశాఖ పర్యవేక్షణ కరువై పాలకపక్ష నిరాదరణకు లోనై మానవ వ్యర్థాలతో వరహాల స్వైరవిహారాలతో మురికి కూపానికి నెలవుగా మారుతుంది. చరిత్ర ఎంతో ఘనమైనది అఖండ భారత దేశం లోనే అత్యంత అరుదుగా ఉన్న పంచ మాధవ క్షేత్రాలలో ఒకటిగా వైష్ణవ ఆళ్వారులకు అత్యంత ముఖ్యమైనదిగా ఘనకీర్తిని ఇనుమడింపుకున్న ఆలయ కోనేరు స్వామివారి తెప్పోత్సవం చక్ర స్నానం వంటి విశిష్ట సేవలకు కాక స్వామివారి నిత్య అభిషేక స్నానపాధులకు కూడా వినియోగించపడుతూ ఉండేది. ఇటువంటి చారిత్రక సాంప్రదాయ సనాతన వైదిక సంస్కృతి నేడు దుర్బర పరిస్థితికి చేరడంతో జనసేన పట్టణ జనసైనికులు నియోజకవర్గ జనసేన నాయకులకు స్థానిక అధిష్టానానికి సమస్యపై స్వందన కార్యక్రమానికి పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. విషయ సమాచారం తెలుసుకున్న నియోజకవర్గ జనసేన నాయకులు వెన్న జగదీష్, ఊట ఆదివిష్ణు(నానిబాబు), తక్షణం స్పందించి పట్టణ జన సైనికులు నియోజకవర్గ జన సైనికులు స్థానిక జనసేన నాయకులను కలుపుకుని స్వామివారి కొలను పరిరక్షణ ప్రభుత్వం తక్షణం చేపట్టాలని నినదిస్తూ ఆందోళన చేపట్టి వారం రోజుల గడువులో ఎటువంటి యాక్షన్ ప్రభుత్వం తీసుకొని యెడల తాము జనసైనికులను కలుపుకుని శ్రమదానం తో కొలను పరిసరాలను పరిశుభ్రంగా మార్చరమే కాక, ఈ ఆలయ పరిరక్షణ నిధుల కేటాయింపుల్లో అవకతవకలు పై నివేదికను తమ జిల్లా అధిష్టానానికి తెలియపరుస్తూ వారి ఆదేశానుసారం పెద్ద ఎత్తున ఆందోళనను కొలను పరిరక్షణ పరిష్కారం జరిగేంత వరకు కొనసాగిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు వేల్పుల చక్రధర్ రావు, లంకా బాబి, రెడ్డి మనోహర్, కరెంట్ సత్తిబాబు పిల్లా సూర్యనారాయణ, వాకపల్లి సూర్యప్రకాశ్, విరవాడ ఎంపిటిసి అభ్యర్థి రామిశెట్టి సూరిబాబు, బావిశెట్టి రామకృష్ణ, బత్తిన దొరబాబు, పిల్లి అన్నారం, బత్తిన శివన్నారాయణ, తిరంశెట్టి ఇస్సాకు, చక్రి, కందా సోమరాజు, సికోలు రాజశేఖర్, మోటురి మహేశ్వర రావు, గంజి గోవిందరాజు.