బీసీలను కలుపుకుని ఆంధ్రప్రదేశ్ లో కాపులు రాజ్యాధికారాన్ని సాధించాలి: తెలంగాణ జనసేన

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం: గాజులరామారం డివిజన్ హెచ్ఐఎల్ కాలనీ వద్ద రంగా మిత్రమండలి వారి ఆధ్వర్యంలో ఆదివారం వంగవీటి మోహన రంగా కాంస్య విగ్రహ ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆయన వారసుడు వంగవీటి రాధ, తోట చంద్రశేఖర్ తో పాటు జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ శంకర్ గౌడ్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు రాదారం రాజలింగం, నియోజకవర్గ ఇన్చార్జి నందగిరి సతీష్ పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో కాపులు ఎప్పటినుండో రాజ్యాధికారం కోసం ఎదురుచూస్తున్నారని, ఆ దిశగా అడుగులు వేసే తరుణమాసన్నమైందని, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కాపులందరూ కూడా బీసీలను అందరిని కలుపుకొని జనసేన పార్టీకి సంపూర్ణ మద్దతు తెలియజేసి రాజ్యాధికారాన్ని చేపట్టాలని అన్నారు. తెలంగాణ రాజకీయాలను జనసేన పార్టీ శాసించే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పాలించే విధంగా మీ యొక్క కార్యచరణ ఉండాలని తెలియజేశారు. రంగా మీద ఉన్న ప్రేమ, అభిమానాలు పవన్ కళ్యాణ్ మీద చూపిస్తూ రాజకీయంగా తనకు బలంగా మనందరం నిలబడాలని, అవినీతి ప్రభుత్వాన్ని ఎండగడుతూ స్వచ్ఛమైన పరిపాలన కోసం భావితరాల భవిష్యత్తు కోసం జనసేన పార్టీకి సంపూర్ణ మద్దతుగా మనమంతా నిలబడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పలు కాపు సంఘాల నాయకులు, పఠాన్చేరు నియోజకవర్గ ఇంచార్జ్ యడమ రాజేష్, శేరిలింగంపల్లి ఇంచార్జ్ మాధవ రెడ్డితో పాటు కార్యకర్తలు, వీరమహిళలు భారీగా పాల్గొన్నారు.