కార్వేటి నగరాన్ని తిరుపతి జిల్లాలో కలపాలి- జనసేన బిజెపిల వినూత్న నిరసన

గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం: కార్వేటినగరం మండల కేంద్రంలో జనసేన బిజెపి ఆధ్వర్యంలో కార్వేటి నగరం మండలాన్ని తిరుపతి జిల్లాలో కలపాలని బుధవారం వినూత్న రీతిలో ధర్నా నిర్వహించారు. జనసేన పార్టి ఆఫీస్ వద్ద, గాండ్ల మిట్ట కూడలి వద్ద కార్వేటి నగరం మండలాన్ని తిరుపతి జిల్లాలో కలపాలని నినాదాలు చేశారు. ఉప ముఖ్యమంత్రి డౌన్ డౌన్ అంటూ, ఉప ముఖ్యమంత్రి నిరంకుశత్వం వైఖరి నశించాలంటూ గళ మెత్తారు. ఈ సందర్భంగా జనసేన నియోజకవర్గ ఇన్చార్జి యుగంధర్ మాట్లాడుతూ ఉపముఖ్యమంత్రి నారాయణస్వామికి సత్తా, సమర్థత, నిబద్దత ఉంటే కార్వేటి నగరఒ మండలాన్ని తిరుపతి జిల్లాలో కలపాలని డిమాండ్ చేశారు. తుడా పరిధిలో ఉన్న కార్వేటి నగరం మండలాన్ని తిరుపతిలో ఎందుకు కలపలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మేల్కొని కార్వేటినగరం మండల ప్రజలకు మేలు చేసే దిశగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జనసేన రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ను గడపగడపలో వ్యక్తిగతంగా విమర్శిస్తే నీకు వచ్చేది ఏమీ లేదని, దీనివల్ల జీరో అవ్వటం తప్ప నువ్వు హీరో అవ్వటం అనేది కల్ల అని ఎద్దేవా చేశారు. ప్యాకేజీ స్టార్ అని, ఇట్టా ఇట్టా ఊగుతా ఉంటాడని అంటే, నీ కూతురు ఆరడుగు మందంతో మేకప్ చేసుకుంటుందని ప్రజలు అంటుంటే మేమేమైనా అడిగామా? అది మీ వ్యక్తిగతం, ఇకనైనా విమర్శలు మానుకొని, సద్విమర్శ చేసుకొని కార్వేటి నగరం మండలాన్ని తిరుపతి జిల్లాలో కలపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలోమండల అధ్యక్షులు శోభన్ బాబు, బిజెపి మండల అధ్యక్షులు రాజశేఖర్, బిజెపి స్టేట్ కౌన్సిల్ మెంబర్ నడింపల్లి యువరాజు, పాలసముద్రం మండల అధ్యక్షులు లతీష్, నియోజకవర్గ యువజన ప్రధాన కార్యదర్శి వెంకటేష్, జిల్లా కార్యక్రమ కమిటీ సభ్యులు భానుచంద్రారెడ్డి, జిల్లా సంయుక్త కార్యదర్శి రాఘవ, మండల కార్యదర్శి మీనా, ప్రతాప్, బిజెపి నాయకులు కుమార్, మధు, గురు పాల్గొన్నారు.