ఉగ్రవాద స్థావరాన్ని కూల్చిన కాశ్మీర్ పోలీసులు

జమ్ముకాశ్మీర్‌ పోలీసులు, సెక్యూరిటీ ఫోర్సెస్ కలిసి అనంతనాగ్‌ అడవుల్లోని ఉగ్రవాద స్థావరాలను నేల మట్టం చేశారు. కృష్ణా దాబా ఎటాక్‌కు పాల్పడిన వారు దొరకడంతో పోలీసులు ఈ మిషన్‌కు కార్యరూపం ఇచ్చారు. ఈ తరుణంలో అనంతనాగ్ అడువుల్లోని ఓ ఉగ్రవాధ శిభిరాన్ని కూల్చి అక్కడి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మిషన్ గురించి కాశ్మీర్ పోలిస్ ఇన్సెక్టర్ విజయ్ కుమార్ మరిన్ని విషయాలను తెలిపారు. ‘అనంతనాగ్ అడవిలోని ఉగ్రవాద శిభిరాన్ని కూల్చి వేశాం, అక్కడి నుంచి కొన్ని గన్నులు వాటి సంబంధిత సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామ’ని చెప్పారు. అయితే అధికారులు తెలిపిన దాని ప్రకారం మూడు ఏకే-56 రైఫిల్స్, రెండు చైనా పిస్టల్స్, రెండు గ్రనేడ్స్, టెలిస్కోప్, ఆరు బులెట్ మ్యాగజీన్‌లు, పిస్టోల్ మ్యాగజీన్‌లు రెండు మరికొన్నింటిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అంతేకాకుండా అక్కడి అన్ని ముఖ్య ప్రదేశాల్లోనూ రక్షణను పెంచామని కాశ్మీర్ ఐజీ తెలిపారు.