జగన్ ఇలాకాలో కాటమరాయుడు, జగన్ కి ప్రత్యాన్మాయం పవన్ మాత్రమే: డాక్టర్ యుగంధర్

వెదురుకుప్పం మండలం కేంద్రంలో జనసేన పార్టీ మండల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ యుగంధర్ పాల్గొని మండల నాయకులకు, జనసైనికులకు దిశానిర్దేశం చేశారు. రాబోయే ఎన్నికలు అత్యంత కీలకమైనవని అత్యంత ప్రతిష్ఠాత్మకమైనవని తెలియజేశారు. జగన్ కి ప్రత్యామ్నాయం పవన్ మాత్రమేనని, బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందాలంటే పవన్ కళ్యాణ్ కి పట్టం కట్టాల్సిన అవసరం ఉందని తెలిపారు. జగన్ ఇలాకాలో కాటమరాయుడు ప్రవేశించాడు. ఆళ్ల మడుగు పంచాయతి నుండి వైసీపీ అభిమాని, నాయకుడు మధుసూదన్ రెడ్డి జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ ఆధ్వర్యంలో, పార్టీలో చేరడం జరిగింది. ఆర్థిక క్రమశిక్షణ కలిగిన నేత. జనాదరణ నేత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, తన జీవితాన్ని ప్రజలకు అంకితం చేయగలిగిన, ఆశ్చర్యమైన ఆలోచనా శక్తి కలిగిన మహా నాయకుడు పవన్ కళ్యాణ్. ఆయన సారధ్యంలోనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, సంక్షేమ పథకాలు సక్రమంగా ప్రజలకు అందుతుంది, యువత అభివృద్ధి చెందుతుంది, మహిళా సాధికారత సాధ్యమవుతుందని జనసేన పార్టీలో చేరడం జరిగింది అని తెలిపారు. జనసేన పార్టీలో చేరడం చాలా ఆనందంగా ఉందని ఈ సందర్భంగా మధుసూదన్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. డాక్టర్ యుగంధర్ మాట్లాడుతూ సంస్థాగత నిర్మాణం, గ్రామస్థాయి నుంచి మండల స్థాయి వరకు పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా పని చేస్తాం అని ధీమా వ్యక్తం చేశారు. భవిష్యత్తు నాయకులు తయారు చేసే మండల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చేస్తామన్నారు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా జనసైనికులు పనిచేస్తారని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి కోలార్ వెంకటేష్, ఉపాధ్యక్షులు సతీష్, ప్రధాన కార్యదర్శి ముని, కార్యదర్శి సతీష్, కార్యనిర్వాహక కార్యదర్శి మోహన్, వేణు, రజిని, దినకర్, వినోద్, రాజశేఖర్, మోహన్ బెనర్జీ, మహేష్, మోహన్ రెడ్డి, పాల్గొనడం జరిగింది.