సభ్యత్వ నమోదు కిట్లను అందజేసిన కాట్రేనిపాడు జనసైనికులు

పార్టీ కార్యకర్తలకు అండగా ఉండాలనే సంకల్పంతో క్రియాశీలక సభ్యత్వం నమోదు కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం రాజోలు నియోజకవర్గం కాట్రేనిపాడు గ్రామములో రాజోలు మండల పరిషత్ ఉపాధ్యక్షుడిగా( వైస్ ఎంపీపీ) ఇంటిపల్లి ఆనందరాజు నుండి జనసేన పార్టీలో క్రియాశీలక సభ్యులుగా చేరిన కార్యకర్తలకు ఈరోజు సభ్యత్వ నమోదు కిట్లను పంపిణి చేశారు. ఈ యొక్క కిట్ లో సభ్యత్వ నమోదు కార్డుతో పాటు, 5 లక్షల ప్రమాద భీమా పత్రం, పార్టీ యొక్క 7 సిద్ధాంతాలతో కూడిన పవన్ కళ్యాణ్ ఫొటో, అధ్యక్షుల వారి మనోగతం యొక్క వివరాలు, ఒక నోట్ బుక్ అందించారు. ఈ కార్యక్రమంలో ఈరోజు సభ్యత్వం తీసుకున్నవారు ఇంటింటికి వెళ్లి జనసేన MPTC అడబాల శ్రీనివాసరావు చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అడబాల పల్లపరాజు, ముత్యాల నరేష్, అంజి స్వామి, మధు, సురేష్ చిన్న, సాయి జనసేన పార్టీ నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.