కటకటాలలో ‘కత్తి’

వివాదాలకు కేంద్ర బిందువు అయినటువంటి మరియు గతంలో పలు సోషల్ మీడియా పోస్టులతో లీగల్ ట్రబుల్స్ ఫేస్ చేసిన కత్తి మహేష్ తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నాడు. గతంలో పవన్ కల్యాణ్‌పై, ఆయన స్థాపించిన జనసేన పార్టీపై పలు వ్యాఖ్యలు చేసి పవర్ స్టార్ అభిమానుల ఆగ్రహానికి గురైన సంగతి తెలిసిందే. అందుకే కత్తి పేరెత్తగానే ప్రజలకు చిర్రెత్తుకొస్తుంది.

అయితే కొన్ని నెలల క్రితం, కత్తి మహేష్ సోషల్ మీడియాలో శ్రీ రాముడిపై ఒక పోస్ట్ చేయడంతో అది చాలా మందికి ఆగ్రహాన్ని తెప్పించింది. ఈ విషయంలో పలు హిందూ సంఘాలు కత్తి మహేష్‌పై పోలీసులకు ఫిర్యాదును కూడా చేశాయి. ఫేస్‌బుక్‌లో వివాదాస్పద పోస్ట్ పెట్టినందుకు సైబర్ క్రైమ్ పోలీసులు కత్తి మహేష్‌పై ఐపిసి 153 ఎ, 505 -1 బి, 505 -2 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పలుమార్లు కత్తి మహేష్‌ని ప్రశ్నించిన పోలీసులు శుక్రవారం అతడిని అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో హాజరుపరచగా నాంపల్లి కోర్టు అతడికి రిమాండ్ విధించింది.