వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లపై కేసీఆర్ నిర్ణయం

ధరణి పోర్టల్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ పోర్టల్ లో కొన్ని సాంకేతిక లోపాలున్నాయని గతంలోనే పేర్కొన్నారు. పోర్టల్ ప్రారంభించిన రోజున ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చెప్పిన సంగతి తెలిసిందే. కాగా, ఈనెల 23 నుంచి వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ కు అనుమతి ఇస్తున్నట్టు సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ కు సంబందించిన రిజిస్ట్రేషన్ ను సీఎస్ సోమేశ్ కుమార్ ప్రారంభిస్తారని సీఎం కేసీఆర్ తెలిపారు. ధరణి పోర్టల్ ఇప్పటికే సక్సెస్ అయ్యిందని, సాంకేతికంగా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా అధికమిస్తామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.