రాష్ట్ర ప్రజలకు కేసీఆర్‌ దసరా శుభాకాంక్షలు

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ఆదివారం దసరా శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా పండుగ జరుపుకుంటామని సీఎం వివరించారు. కరోనా మహమ్మారిని జయించి రాష్ట్ర ప్రజలు సంతోషంగా, సుసంపన్నంగా జీవించేలా ఆశీర్వదించాలని దుర్గాదేవిని సీఎం కేసీఆర్‌ ప్రార్థించారు. కొవిడ్‌ నిబంధనలకు లోబడి ప్రజలు విజయదశమిని జరుపుకోవాలని ప్రజలను సీఎం కోరారు. అలాగే పండుగ పూట తెలంగాణలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు దసరా పండుగ పూట ముఖ్యమంత్రి కేసీఆర్ తియ్యటి శుభవార్త చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. 2019 జులై నుంచి రావాల్సిన డీఏను వెంటనే విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు.

అలాగే ప్రజలకు రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. అమ్మవారి కృప అందరిపై ఉండాలని, చేసే ప్రతి పనిలో విజయం సాధించాలని ఆకాంక్షించారు. అపజయాన్ని సైతం తట్టుకొని నిలబడగలిగే శక్తిని, దేన్నైనా ఎదుర్కొనే ధైర్యాన్ని ఇవ్వాలని అమ్మవారిని మంత్రి కొప్పుల వేడుకున్నారు.