ఏపీ బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించిన కిషన్ రెడ్డి

విజయవాడ నగరంలో ఏర్పాటు చేసిన బీజేపీ రాష్ట్ర నూతన కార్యాలయాన్ని విజయదశమి సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. తొలుత ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో అధికారులు కిషన్‌రెడ్డికి స్వాగతం పలికారు. కరోనా మహమ్మారిపోయి ప్రజలు సుఖసంతోషాలతో ఉండేలా దీవించాలని దుర్గమ్మను వేడుకున్నట్టు కిషన్‌రెడ్డి తెలిపారు. అనంతరంఅక్కడి నుంచి బీజేపీ రాష్ట్ర నూతన కార్యాలయం వద్దకు చేరుకున్న ఆయన.. సంప్రదాయ పూజా కార్యక్రమాలు అనంతరం కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, జీవీఎల్ నరసింహారావు, విష్ణువర్ధన్ రెడ్డి, మధుకర్, ఇతర నాయకులు పాల్గొన్నారు.