వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్

వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై  కేసీఆర్ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు. భూములకు సంబంధించిన ఎలాంటి రిజిస్ట్రేషన్లు అయినా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ధరణి పోర్టల్ ద్వారా జరగాలని ఇటీవల ప్రభుత్వం సూచించిన సంగతి తెలిసిందే. అయితే, టెక్నికల్ గా ఆలస్యం అవుతుండటంతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఆలస్యం అయ్యింది. దీనిపై హైకోర్టులో కేసు నడుస్తున్న సంగతి తెలిసిందే. కోర్టు ఆదేశాలతో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియను నేటి నుంచి తిరిగి ప్రారంభించబోతున్నారు. పాత పద్దతిలోనే రిజిస్ట్రేషన్ల ప్రక్రియను కొనసాగించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.