మాస్కో పర్యటనలో కీలక అంశాలు

భారత్-చైనా సరిహద్దు తూర్పు లడాఖ్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. బలగాల మొహరింపు హై టెన్షన్ పరిస్టితి ఏర్పడింది. అయితే మాస్కోలో షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సులో భారత రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పాల్గొన్నారు. చైనా రక్షణశాఖ మంత్రి వీ ఫెంగ్ కూడా హాజరయ్యారు. గురువారం రోజున రష్యా రక్షణశాఖ మంత్రి జనరల్ సెర్గీ షోయ్గుతో రాజ్ నాథ్ సమావేశమయ్యారు. దీంతో వీ ఫెంగ్ కంగారుపడ్డారు.

సెర్గీ షోయ్గుతో రాజ్ నాథ్ సింగ్ ఏం అంశాలు డిస్కష్ చేశారోనని సరిహద్దు పరిస్థితుల గురించి లోలోన భయపడుతూనే ఉన్నారు. దీంతో శుక్రవారం సమావేశమవుదామని రాజ్ నాథ్‌ని కోరారు. నౌకాదళం, రష్యా ప్రత్యర్థి మలక్కా జలసంధి నుంచి నిర్వహించే ఇంద్ర నావికాదళ విన్యాసాలు హిందూ మహాసముద్రంలో నిర్వహిస్తామని రాజ్ నాథ్ సంకేతాలను ఇచ్చారు. సమావేశంలో ఉగ్రవాదం, ప్రాంతీయ భద్రతా సవాళ్లు, ఇండియా చైనా రష్యా, కిర్గిగిస్తాన్, పాకిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్ దేశాలు సహకారంపై చర్చిస్తున్నాయి.

గాల్వాన్ వ్యాలీలో చైనాతో భారత్ ఘర్షణ తర్వాత రెండోసారి మాస్కోకు రాజ్ నాథ్ సింగ్ వెళ్లారు. జూన్‌లో జరిగిన ఘర్షణతో 20 మంది భారత సైనికులు చనిపోయిన సంగతి తెలిసిందే. చైనా నుంచి సైనికులు చనిపోయిన ఆ దేశం ధృవీకరించలేదు. కానీ గతనెల 29, 30, 31వ తేదీల్లో మరోసారి చొచ్చుకొచ్చేందుకు చైనా ప్రయత్నించింది. అయితే భారత భద్రతా దళాలు వారిని విజయవంతంగా అడ్డుకున్నాయి. దీంతో ఎస్ సీ వో భేటీలో రాజ్ నాథ్ పాల్గొనగా.. సమావేశం అవుదామని ఫెంగ్ కోరడం ప్రాధాన్యం సంతరించుకుంది.