ఓటీటీలో కీర్తి సురేష్ ‘గుడ్ లక్ సఖి’

నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్ట్రెస్ కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన లేడీ ఓరియెంటెడ్ మూవీ ”గుడ్ లక్ సఖి”. ఆది పినిశెట్టి మేల్ లీడ్ పోషిస్తున్న ఈ చిత్రంలో జగపతి బాబు కీలక పాత్రలో నటిస్తున్నారు. ‘లక్ష్మి’ ‘ధనిక్’ వంటి చిత్రాలతో విలక్షణ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న నగేష్ కుకునూర్ ఈ సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెడుతున్నాడు.కీర్తి సురేష్ ‘గుడ్ లక్ సఖి’ ఓటీటీలో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. జీ5లో ఈ సినిమాని విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.జూన్ 3న విడుదల చేయాలని అనుకున్నా కరోనా సెకండ్ వేవ్ వల్ల వాయిదా పడింది. దాంతో జీ5 ఓటీటీ ద్వారా ఈ సినిమాని విడుదల చేయటానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సినిమాలో షార్ప్ షూటర్ పాత్రలో ఆమె నటించినట్టు సమాచారం. ఆది పినిశెట్టి, జగపతి బాబు కీలక పాత్రలు పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ దీనికి సంగీతం సమకూర్చారు. దిల్ రాజు సమర్పణలో సుధీర్ చంద్ర పదిరి ఈ చిత్రాన్ని నిర్మించారు.ఓటీటీలో తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఈ సినిమాని విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా తర్వాత కీర్తి సురేష్ మహేష్ బాబుతో ‘సర్కారు వారి పాట’లో నటిస్తోంది. రజినీ కాంత్ తో నటించిన ‘అన్నాత్తే’ షూటింగ్ దాదాపు పూర్తయింది. గుడ్ లక్ సఖి మాత్రం ఈ నెలలోనే ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.