KKR vs RCB టాస్ గెలిచిన బ్యాటింగ్‌ ఎంచుకున్న కోల్‌కతా

ఐపీఎల్‌-13లో మరో ఆసక్తికర పోరు ఆరంభంకానుంది. విరాట్‌ కోహ్లీ సారథ్యంలోని రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, ఇయాన్‌ మోర్గాన్‌ నేతృత్వంలోని కోల్‌కతా నైట్‌రైడర్స్‌ నువ్వా.. నేనా అనే స్థాయిలో పోటీపడుతున్నాయి. ఇరు జట్లు ప్లేఆఫ్స్‌ బెర్తుపై కన్నేసిన నేపథ్యంలో మ్యాచ్‌ రసవత్తరంగా సాగనుంది.

టాస్‌ గెలిచిన కోల్‌కతా కెప్టెన్‌ మోర్గాన్‌ బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. టామ్‌ బాంటన్‌, ప్రసిధ్‌ కృష్ణలను తుది జట్టులోకి తీసుకున్నట్లు మోర్గాన్‌ వెల్లడించాడు. షాబాద్‌ అహ్మద్‌ స్థానంలో మహ్మద్‌ సిరాజ్‌ జట్టులోకి వచ్చినట్లు బెంగళూరు సారథి విరాట్‌ పేర్కొన్నాడు.