కోల్ కతా Vs రాజస్థాన్

ఐపీఎల్ 2020 లో ఈ రోజు 12 వ మ్యాచ్ దుబాయ్‌ వేదికగా రాజస్థాన్‌ రాయల్స్‌, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జట్ల బిగ్ ఫైట్ జరుగుతోంది. అయితే ఈ మ్యాచ్ లో రాజస్థాన్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతో టాస్ ఓడిన కేకేఆర్ మొదట బ్యాటింగ్ చేయనుంది. ఇక రాజస్థాన్ వరుస విజయాలతో మంచి ఫామ్ లో ఉండగా చివరి మ్యాచ్ గెలిచిన ఉత్సహం లో కేకేఆర్ ఉంది. మరి ఈ రెండు జట్లలో ఏ జట్టు గెలుస్తుంది. రాయల్స్ మూడో విజయంతో హ్యాట్రిక్ కొడతారా.. లేదా అనేది చూడాలి.

ఇరు జట్లలో బ్యాటింగ్‌, బౌలింగ్‌ లైనప్‌లు పటిష్ఠంగా ఉండటంతో పోరు రసవత్తరంగా ఉండనుంది. గత మ్యాచ్‌ల్లో గెలిచిన ఉత్సాహంలో ఉన్న రాజస్థాన్‌, కోల్‌కతా అదే ఊపును కొనసాగించాలని చూస్తున్నాయి.