చీమల లక్ష్మీనారాయణకు నివాళులర్పించిన కొలుసు పార్థసారథి

నూజివీడు మండలం, చీమల లక్ష్మీనారాయణ స్వగృహానికి వెళ్లి వారి చిత్రపటానికి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను ఓదార్చి అన్ని రకాలుగా మీకు అండగా ఉంటానని, మీకు ఏ సమస్య వచ్చినా నన్ను వచ్చి డైరెక్ట్ గా కలవచ్చని కొలుసు పార్థసారథి చీమల లక్ష్మీనారాయణ కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. వెంకటాయపాలెం గ్రామ వైసీపీ ఉప సర్పంచ్ గా ప్రజాసేవ చేసిన చీమల లక్ష్మీనారాయణ స్వర్గస్తులై సంవత్సరం అవుతున్నా కనీసం వారి కుటుంబ సభ్యులను నూజివీడు ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు పలకరించి ఓదార్చే సమయం లేకపోయిందని కొలుసు పార్థసారథి విమర్శించారు. ఈ కార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులు చీమల రవి, జనసేన నాయకులు కోలా ఉమా, దొడ్ల నాగాంజనేయులు, నూజివీడు మండల జనసేన పార్టీ ఉపాధ్యక్షులు ఇంటూరి చంటి, తెలుగుదేశం నాయకులు మాపత్తి రాజు, వెంకటాయపాలెం గ్రామ టిడిపి అధ్యక్షులు ఇందుపల్లి శీను, జనసేన పార్టీ కృష్ణా జిల్లా అధికార ప్రతినిధి మరిదు శివరామకృష్ణ, నూజివీడు పట్టణ టిడిపి అధ్యక్షులు మలిశెట్టి జగదీష్, నూజివీడు నియోజకవర్గ జనసేన పార్టీ ముఖ్య నాయకులు ముత్యాల కామేష్, నూజివీడు నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షులు జగ్గవరపు వెంకటరెడ్డి, నూజివీడు నియోజకవర్గ టిడిపి ఎస్సీ సెల్ అధ్యక్షులు హరికోటి సంగీతరావు మాస్టర్, నూజివీడు మండల టిడిపి అధ్యక్షులు ముసునూరు రాజా, నూజివీడు మండల జనసేన పార్టీ అధ్యక్షులు యర్రంశెట్టి రాము, జంగం గూడెం గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పాటిమీద హనుమంతరావు, దేవరగుంట గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వంకాయల హరిబాబు, వెంకటాయపాలెం గ్రామస్తులు మాగం వేణు, పూజారి రమేష్, పూజారి విక్రమ్, పూజారి జేని తదితరులు పాల్గొన్నారు.