జనసేన వీరమహిళ వ్యాపారానికి అండగా కొఠారు ఆదిశేషు

దెందులూరు నియోజకవర్గం, విజయరాయి గ్రామానికి చెందిన జనసేన చిన్నమ్మ గా పిలవబడే చేపల వ్యాపారి చిన్నమ్మ చేపల కొట్టులో తరుచుగా రాత్రి వేళలు చేపలను గుర్తుతెలియని వ్యక్తులు చంపేస్తుండటంతో.. నియోజకవర్గ నాయకులు కొఠారు ఆదిశేషు స్థానిక జనసైనికుల ద్వారా సమస్యను తెలుసుకొని చిన్నమ్మ కొట్టు పరిసరాలు పరిశీలించి, వారిని దిగాలు చెందవద్దని ధైర్యం చెప్పి, దుండగులను ఎట్టి పరిస్థితిలోనూ వదలబోవమని మాట ఇచ్చారు. వారి కొట్టు ఆవరణలో నిఘా కెమెరాలు మరియు ఇనుప గ్రిల్లులు ఏర్పాటు చేస్తామని మాటిచ్చి.. తక్షణ సహాయంగా వారికి 10,000రూ. లు ఆర్థిక సహాయం అందజేసి.. వ్యాపారానికి పూర్తి భద్రత కల్పించే బాధ్యత తాను తీసుకుంటానని.. మిగతా ఏర్పాట్లకు అయ్యే ఖర్చు కూడా తాను భరిస్తానని హామీ ఇచ్చారు.