దుర్గమ్మ సన్నిధిలో కోటి దీపోత్సవం

ఇంద్రకీలాద్రిపై కోటి దీపోత్సవం ఘనంగా జరిగింది. ఆలయ ప్రాంగణం.. అర్జునవీధిలో భక్తులు దీపాలు వెలిగించారు. అర్చకుల వేదమంత్రోచ్ఛారణల మధ్య ఈవో, చైర్మన్‌లు మహాగోపురం ఎదురుగా ఏర్పాటుచేసిన అఖండ జ్యోతికి దీప ప్రజ్వలనచేసి కోటి దీపోత్సవాన్ని ప్రారంభించారు. మల్లేశ్వరస్వామి ఆలయం వద్ద జ్వాలాతోరణం ఘనంగా జరిగింది.