ఎయిర్‌టెల్ తో టీ-శాట్ ఒప్పందం

తెలంగాణ విద్యార్థులకు నిపుణులతో వీడియోల ద్వారా పాఠాలను బోధిస్తున్న టీ-శాట్‌ విద్య ఇక నుండి ఎయిర్‌టెల్ డీటీహెచ్‌లో ప్రసారం కాబోతున్నాయి. కమ్యూనికేషన్ రంగంలో మూడవ స్థానంలో ఉన్నటువంటి భారతీ ఎయిర్‌టెల్ డీటీహెచ్‌లో ఛానల్ నoబర్లు 948, 949లలో టీ-శాట్‌ విద్య ప్రసారానికి అనుమతినిస్తూ టీ-శాట్ నెట్‌వర్క్‌తో ఎయిర్‌టెల్ సంస్థ గురువారంనాడు ఒప్పందం చేసుకుంది. టీ-శాట్ నెట్‌వర్క్‌ వివిధ సంస్థలతో ఇప్పటికే ఒప్పందం చేసుకుంది. దీనికిగాను టీ-శాట్ ఛానళ్లు విద్య, నిపుణ ప్రసారం చేయడానికి అంగీకారం తెలియచేసింది. ఆగస్టు 15వ తేదిన 74వ స్వాతంత్ర దినోత్సవాన్ని సందర్భంగా టీ-శాట్, ఎయిర్‌టెల్ డీటీహెచ్ మధ్య కుదిరిన ఒప్పందంపై టీ-శాట్ సీఈవో ఆర్.శైలేష్ రెడ్డి, భారతీ ఎయిర్‌టెల్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సీఈవో అవనీత్ పురి గురువారం సంయుక్త ప్రకటన విడుదల చేసి, వారు సంతోషాన్ని తెలిపారు. తొలిసారిగా టీ-శాట్ నెట్‌వర్క్ ఛానళ్లు భారతీ ఎయిర్‌టెల్‌లో ప్రసారం చేయబోతున్నందుకు సీఈవో శైలేష్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఇదే సమయంలో ఏపీ సీఈవో అవనీత్ పురి తెలంగాణ విద్యార్థులకు ప్రభుత్వ సంస్థ టీ-శాట్ ద్వారా సేవలందించడం సంతోషంగా ఉందని తెలిపారు.