బిజెపి-జనసేన విజయ సంకల్ప సభలో పవన్ కళ్యాణ్ ని కలిసిన కొట్టె మల్లికార్జున

తెలంగాణ రాష్ట్ర ఎన్నికలకు సంబంధించి కూకట్ పల్లి బిజెపి మరియు జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ప్రేమ్ కుమార్ గెలుపు కోసం కూకట్ పల్లి అంబేద్కర్ మెట్రో దగ్గరలో గల మైదానంలో బిజెపి – జనసేన విజయ సంకల్ప సభను ఆదివారం భారీగా జనసందోహం మధ్య నిర్వహించడం జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు, నాదెండ్ల మనోహర్ మరియు బిజెపి జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, ఇతర బిజెపి, జనసేన నాయకులు హాజరయ్యారు. పవన్ కళ్యాణ్, జేపీ నడ్డా, నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ కూకట్ పల్లి అభ్యర్థి శ్రీ ప్రేమ్ కుమార్ గెలుపు కోసం కృషి చేయాలని పేర్కొన్నారు. బిజెపి యువ నాయకులు మరియు కాపు సంక్షేమ నాయకులు కొట్టె మల్లికార్జున మాట్లాడుతూ బిజెపి యువ నాయకులుగా మరియు కాపు యువ నేత గా కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని కలవడం మరియు కూకట్ పల్లి అభ్యర్థి ప్రేమ్ కుమార్ గెలుపు కోసం కృషి చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. పవన్ కళ్యాణ్ అభిమానిగా సినీ రంగంలో మొదలైన నా ప్రయాణం, తర్వాత పవన్ కళ్యాణ్, కిషన్ రెడ్డి, బండి సంజయ్, డాక్టర్ లక్ష్మణ్ లాంటి నాయకులను స్ఫూర్తి తీసుకొని సివిల్స్ ప్రిపరేషన్ తర్వాత బిజెపి పార్టీ లో చేరడమే కాకుండా, బిజెపి యువ నాయకులుగా అంచలంచెలుగా ఎదుగుతూ రాజకీయాల్లో నాకంటూ యువతలో ఒక ప్రత్యేక స్థానంను సంపాదించుకోవడం చాలా ఆనందంగా ఉంది. కూకట్ పల్లి నియోజక వర్గం ప్రజలు, యువతీ, యువకులు అందరూ, ప్రతి ఒక్కరూ బిజెపి – జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ ప్రేమ్ కుమార్ ను భారీ అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తూ, తప్పకుండా అవకాశం వస్తే బిజెపి – జనసేన మద్దతు తో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధం అని పేర్కొంటూ, యువత రాజకీయాల్లోకి రావాలని పేర్కొన్నారు. బిజెపి -జనసేన విజయసంకల్ప సభను విజయవంతం చేసిన బిజెపి నాయకులు విజిత్, హరీష్ రెడ్డి, మరియు జనసేన నాయకులు రాధాలింగం, మహేంద్ర రెడ్డి, కావ్య, ఇతర బిజెపి, జనసేన నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు.