కొవాగ్జిన్‌తో యూకే వైరస్‌కు ‘చెక్‌’

కోవాగ్జిన్ టీకా తయారీదారు భారత్‌ బయోటెక్‌ కీలక విషయాన్ని ప్రకటించింది. తాము రూపొందిస్తున్న కరోనా వ్యాక్సిన్ కోవాగ్జిన్‌ బ్రిటన్‌లో కలకలం రేపిన కొత్త రకం ప్రాణాంతక కరోనా వైరస్‌పై సమర్థవంతంగా పని చేస్తున్నట్లు తెలిపింది. దీనికి సంబంధించి భారత్ బయోటెక్‌ ట్వీట్ చేసింది.

చైనాలోని వూహాన్‌లో పుట్టిన కరోనా కంటే 70 శాతం ఎక్కువగా వ్యాపిస్తున్నట్టు భావిస్తున్న బ్రిటన్‌ కొత్త వేరియంట్‌ వైరస్‌ను తమ వ్యాక్సిన్‌ విజయవంతంగా అరికడుతోందని తెలిపింది భారత్ బయోటెక్.