కొయ్యురు మండల జనసేన ఆత్మీయ సమావేశం

అల్లూరి జిల్లా కొయ్యురు, జనసేన పార్టీ ఇన్చార్జ్ డా.వంపూరు గంగులయ్య అదేశాల మేరకు కొయ్యురు మండల సమావేశంలో పాల్గొన్న జనసేనపార్టీ కార్యదర్శి ఉల్లి సీతారామ్, మండల అధ్యక్షులు గూడెం లక్ష్మణ్, బూత్ కన్వీనర్ సాగిన బుజ్జిబాబు ఆధ్వర్యంలో జనసైనికులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో జనసేనపార్టీ బలోపేతానికి గ్రామస్థాయి పర్యటనకు మండల నాయకులందరూ సిద్ధం కావాలని త్వరలోనే పంచాయితీ స్థాయి నాయకులు కూడా తమ కార్యక్రమాలు వేగవంతం చేయనున్నారన్నారు. డా.గంగులయ్య ఆదేశం మేరకు పార్టీ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పారు అలాగే మీకు ఈ సందేశం ఇవ్వాలన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జనసేనపార్టీ గెలుపే లక్ష్యంగా పని చేయాలని ఈ మండలంలో గల 33 పంచాయతీలకు పని చేయడానికి పనివిభజన చేసుకుని సమన్వయంతో ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యకులు గూడెం లక్ష్మణ్, సాగిన బుజ్జిబాబు మాట్లాడుతూ కచ్చితంగా గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని అందు పార్టీ నిర్దేశించిన విధివిధానాలను పాటించి ముందుకు సాగుతామన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గూడెం లక్ష్మణ్, బూత్ చైర్మన్ సాగిన బుజ్జిబాబు, జూర్రా సూర్యప్రకాష్, పీట సుధీర్,పొత్తిక రామ్ ప్రసాద్, కారంగి నవీన్, కొర్ర రాజు, గూడెపు శేషుబాబు, అనిశెట్టి నానీ, కాకర కుమార్, జూర్రా సురేష్, నివాష్, నాగేంద్ర, దిబ్బ సతీష్, తుర్రె సంజీవ్ తదితరులు హాజరయ్యారు.