చక్రికి ఆర్థిక సహాయం చేసిన కూనసాని నాగబాబు

పెడన, చిరంజీవి హెల్పింగ్ ఫౌండేషన్ (సి.హెచ్.ఎఫ్) ద్వారా ఎంతో మందికి సహాయం చేసిన దొండపాటి చక్రధర్, క్యాన్సర్ భారినపడి ఇబ్బంది పడుతున్నాడు. చిరంజీవి స్పందించి ట్రీట్మెంట్ చేయుస్తున్నారు. చక్రి అనారోగ్యపరంగా ఇబ్బందుల్లో ఉన్నాడని తెలుసుకొని ముందుగా 25 వేల రూపాయలను తన వంతు సహాయంగా ప్రకటించి అపారమైన తన ఉదార స్వభావాన్ని చాటుకున్న నాగబాబు. సోమవారం చక్రీని(తన నివాసమందు) కలిసి ముందుగా తాను ప్రకటించిన 25 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఎవరికి ఆపద వచ్చినా తన ఆపన్న హస్తాన్ని అందించడంలో కూనసాని నాగబాబు ముందుంటారు. సహాయ అడిగిన వ్యక్తికి తన శక్తి కొలది సహాయం చేసే మనసున్న వ్యక్తి కూనసాని. కరోనా కష్టకాలంలో ఎంతోమందికి ఆక్సిజన్ సిలిండర్ అందజేసి తన ఉదార స్వభావాన్ని చాటుకున్నారు. కరోనా సమయంలో కష్టాల్లో ఉన్న వాళ్ళకి తన వంతు సహాయంగా కూరగాయలు, నిత్యావసర వస్తువులు అందించి మానవత్వాన్ని చాటుకున్న కూనసాని నాగబాబు గొప్ప మానవతవాది అని నిరూపించుకున్నారు.