పిఠాపురం టౌన్ మార్కెట్ దుర్గామాత ఉత్సవాలకు మాకినీడి శేషుకుమారి

కాకినాడ జిల్లా, పిఠాపురం నియోజకవర్గంలోని, పిఠాపురం టౌన్ నందు మార్కెట్ యార్డ్ వద్ద దసరా శరన్నవరాత్రుల ఉత్సవాలలో భాగంగా, వేంచేసి ఉన్న దుర్గామాత అమ్మవారి ఆహ్వాన కమిటీ పిలుపు మేరకు, మాజీ కౌన్సిలర్ మార్కెటింగ్ కమిటీ ప్రెసిడెంట్ వేణు నారాయణరావు ఆత్మీయ ఆహ్వానంతో దుర్గామాత శరన్న నవరాత్రి ఉత్సవాలలో సోమవారం రాత్రి పిఠాపురం జనసేన ఇంచార్జి మాకినీడి శేషుకుమారి పాల్గొనడం జరిగినది. ఈ కార్యక్రమమునకు హాజరై హరిశ్చంద్ర నాటకం నిర్వహిస్తున్న కళాకారులకు అభినందనలు తెలుపుతూ, పూర్తిగా నాటక రంగం కనుమరుగవుతున్న తరుణంలో కూడా, హిందూ సాంప్రదాయాలను గౌరవిస్తూ, పూజిస్తూ ఉండడం ఎంతో గొప్ప విషయమని తెలియజేశారు. పిఠాపురం మార్కెట్ యార్డ్ దుర్గామాత కమిటీ ఆహ్వాన కమిటీ సభ్యులు, మాజీ కౌన్సిలర్ మార్కెటింగ్ ప్రెసిడెంట్ వేణు నారాయణరావు ప్రత్యేకమైన శ్రద్ధతో, నేటి తరం యువతకు సమాజంలో ఉన్న నేటి ప్రజలకు, పాతతరంలోని విలువలను, నాటక రంగాన్ని సాంప్రదాయంగా కొత్త తరం యువతకు తెలియజేయాలని, కళామతల్లిని, నాటక రంగాన్ని ప్రోత్సహించాలని సత్య హరిచంద్ర నాటకాన్ని నిర్వహించడం ఎంతో గొప్ప విషయమని, ఆహ్వాన కమిటీ వారిని కూడా అభినందనలు తెలుపుతూ, హరిశ్చంద్ర నాటకానికి తన వంతుగా సగభాగం ఆర్థికంగా, ఆహ్వాన కమిటీకి నాటక కార్యక్రం ఖర్చుకు చేయూత అందించడం జరిగినదని, అదేవిధంగా మాకినీడి శేషుకుమారి సహకారం మరువలేనిదని ఆలయ కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రముఖ జనసేన నేత మాకినీడి శేషుకుమారి మాట్లాడుతూ… ప్రతి ఒక్కరూ పాతతరం యొక్క గొప్పదనాన్ని, విలువలను తెలుసుకోవాలని, నీతి, న్యాయం వైపు నడవాలని, ఇలాంటి గొప్ప విలువలు సమాజానికి యువతకు తెలియపరచాలంటే నాటక రంగం ద్వారా సాధ్యమవుతుందని, హరిశ్చంద్ర నాటకం ఒక బాటగా, ఒక దారిగా యువతకు మార్గం అవుతుందని తెలియజేశారు. ఎలాంటి కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా హరిశ్చంద్రుడు న్యాయం తప్పలేదని, ఇలాంటి సాంస్కృతిక నాటక కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ కూడా ప్రోత్సహించాలని, ధర్మాన్ని నిలబెట్టాలని ప్రతి ఒక్కరిని, పిఠాపురం నియోజకవర్గం నుంచి వచ్చిన ప్రజలందరకు ఒక్కసారి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ ని చూడండి అంటూ ఈ సందర్భంగా మాకినీడి శేషుకుమారి కోరారు. ఈ కార్యక్రమంలో నెయ్యి కాపుల సురేష్, కారపురెడ్డి మణికంఠ, రాయవరపు శివ దుర్గ, పడాల కన్నా, పొన్నాడ మురళీకృష్ణ, ఆగంటి దుర్గ, దసరా మణికంఠ, యడ్ల సత్తిబాబు, బి. వీరబాబు, జి. నానాజ్జి, మేళం బాబి, తోట సతీష్, దేశిరెడ్డి సతీష్, జనసేన నాయకులు, జనసైనికులు, నియోజకవర్గ ప్రజలు ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.