కర్నూలు జిల్లా జనసేన పార్టీ మహిళా సమీక్షా సమావేశం

కర్నూలు జిల్లా జనసేన పార్టీ మహిళా సమీక్షా సమావేశంలో రాయలసీమ మహిళా విభాగం ప్రాంతీయ కమిటీ సభ్యురాలు శ్రీమతి పెండ్యాల శ్రీలత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జనసేన పార్టీలో మహిళలకు ఉన్నత స్థానాన్ని పవన్ కళ్యాణ్ కల్పించారని.. ఈ అవకాశాన్ని, గౌరవాన్ని నిలబెట్టుకుంటూ.. జనసేన పార్టీని మహిళలు ముందుండి నడపాలని.. ఇది జనసేన పార్టీ అధికారంలోకి రావడం కోసమే కాదని.. రాష్ట్ర భవిష్యత్తు కోసం, పిల్లల బంగారు భవిష్యత్తు కోసం జనసేన పార్టీని అధికారంలోకి తీసుకు రావాలని లేదంటే ఈ ప్రభుత్వం వల్ల మహిళలు ఎక్కువ నష్టపోతున్నారని మహిళలను నమ్మించి మీఅన్నను, తమ్ముడినని, మి పిల్లలకు మేనమామనని అమ్మ ఒడి పథకంలో 2000 రూపాయల కోత విధిస్తున్నాడని.. ఇది కోతల ప్రభుత్వం అని తెలియజేస్తూ.. ఆత్మహత్య చేసుకున్న రైతులకు పాస్ బుక్ లేదు, కౌలు కార్డు లేదన్న సాకుతో ప్రభుత్వం నుండి రావలసిన డబ్బును ఏదో ఒక సాకుతో ఆపి ప్రజలను వంచించి ఈ వైసీపీ ప్రభుత్వం మోసం చేస్తోందని.. ఈ వైసీపీ ప్రభుత్వ మోసపూరిత నిర్ణయాలు, విధానాలు ప్రజలకు తెలియజేస్తూ.. జనసేన పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని ప్రతి మహిళనుకోరుకుంటున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి రాయపాటి అరుణ, రాయలసీమ ప్రాంతీయ కమిటీ సభ్యులు హసీనా బేగం, పసుపులేటి పద్మావతి, జ్యోతి, పాణ్యం నియోజక వర్గ ఇన్చార్జ్ చింత సురేష్ బాబు, నాయకులు నక్కల మిట్ట శ్రీనివాస్, అనంతపురం జిల్లా మహిళా నాయకురాలు కాశేట్టి సావిత్రి తదితరులు పాల్గొనడం జరిగింది.