గాజుల శంకరరావుని పరామర్శించిన మండలి రాజేష్!

ఉమ్మడి కృష్ణా జిల్లా కార్యదర్శి ఇటీవల కొంత కాలంగా అనరోగ్యంతో పార్టీ కార్యక్రమలకు పాల్గొనలేకపోతున్నారు అని తెలిసి జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి మండలి రాజేష్ ఆయన స్వగృహానికి వెళ్లి ఆయనను పరామర్శించి ఆయన యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గాజుల శంకరరావు మాట్లాడుతు.. అవనిగడ్డ అసెంబ్లీ మరియు మచిలీపట్నం లోక్ సభ జనసేన పార్టీకి కేటాయించడం చాలా సంతోషంగా ఉంది అని అన్నారు. అందులో అవనిగడ్డ నియోజకవర్గం గాంధేయ వాది మండలి బుద్ధ ప్రసాద్ కి కేటాయించినందుకు పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇంటి వద్దనుంచే జనసేన అభ్యర్ధుల గెలుపుకై తన వంతు కృషి చేస్తానని మాట ఇచ్చారు.. అలాగే అవనిగడ్డ పరిశీలీకులుగా వచ్చిన రాజేష్ గారికి శాలువాతో సత్కరించి మండలి బుద్ధ ప్రసాద్ గారి విజయానికి మీరు బాగా కష్టపడి పని చేస్తున్నారని అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి పద్యాల వెంకట ప్రసాద్, సీనియర్ నాయకులు గుడివాడ శివరామ్, బోగది రత్తయ్య, ముమ్మరెడ్డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.