వరద బాధితులను ఆదుకున్న కువైట్ జనసేన

వరదల్లో సర్వం కోల్పోయి సహాయం కోసం ఎదురుచూస్తున్న వరద బాధితులను ఆదుకోవడం కోసం కువైట్ జనసేన నాయకులు ముందుకు వచ్చారు. జనసేన నాయకులు నరస రామయ్య వృత్తి రీత్యా కువైట్ లో ఉంటూ వరద బాధితులకు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. మంగళవారం గురుపేట, పాటూరు మరియు ఎర్రి పాపగారిపల్లిలో లక్ష అయిదు వేల రూపాయల నిత్యావసర వస్తువులు మరియు ఆర్థిక సహాయం అందించారు. స్థానిక జనసేన నాయకులు పురం సురేష్ మాట్లాడుతూ రూపాయికి రూపాయికి పోగు వేసుకొని కొనుక్కున్న వస్తువులన్నీ కళ్ళముందే నీటిపాలు అయ్యాయని వారి మాటలు వింటుంటే గుండె బరువెక్కుతోందని బాధితులతో కలిసి మాట్లాడి వారిని ఓదార్చారు. ఇది మనందరి బాధ్యత అని తిమ్మాయిపాలెం జనసేన నాయకులు పురం సురేష్ సింగిరి నరస రామయ్య అన్నారు.