ఇంతేరు భూ కుంభకోణంపై అధికారుల్లో చలనం కరువు: యడ్లపల్లి రామ్ సుధీర్

  • వేల ఎకరాల్లో ఆక్రమణలు – కన్నెత్తి చూడని రెవిన్యూ అధికారులు.
  • అక్రమ ఆక్వా సాగు వెనుక బడా నేతలు.
  • అధికార – విపక్ష నాయకుల కుమ్మక్కు
  • దర్జాగా విద్యుత్ లైన్లు, ట్రాన్స్ ఫార్మర్లు
  • జనసేన పార్టీ గ్రౌండ్ రిపోర్ట్ వెలుగు చూసిన నిజాలు.
  • త్వరలో పూర్తి నివేదిక జిల్లా కలెక్టర్ దృష్టికి.
  • స్పందన రాకుంటే గ్రీన్ ట్రిబ్యునల్ – హైకోర్టుల్లోనూ కేసులు.
  • అక్రమాల నిగ్గు తేల్చేవరకూ విశ్రమించం.

పెడన నియోజవర్గం, కృత్తివెన్ను మండల పరిధిలోని ఇంతేరు తీర ప్రాంతంలో వేల ఎకరాల ప్రభుత్వ భూమి బడా రాజకీయ నాయకుల కనుసన్నల్లో ఆక్రమణకు గురైంది. కోస్టల్, రెగ్యులేటరీ, జోన్ నిబంధనలతో పాటు గ్రీన్, ట్రిబ్యునల్, రెవెన్యూ చట్టాలు తూట్లు పొడుస్తూ వందలాది ఎకరాల్లో చెరువులు తవ్వేసి అక్రమంగా ఆక్వా సాగు చేస్తున్నారు. యదేచ్చగా తీరప్రాంతం మొత్తం తవ్వే స్తుంటే అధికారులు అంటి ము ట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. అంత భారీ మొత్తంలో ప్రభుత్వ భూమి కబ్జా కు గురవుతుంటే అధికారులు ఎందుకు కళ్ళు మూసుకు కూర్చున్నారు. ప్రభుత్వ భూమిని కాపాడాల్సిన అధికారుల్లో ఎందుకు చలనం లేదు. అనే విషయాల మీద క్షేత్రస్థాయిలో జనసేన పార్టీ తరఫున విచారణ చేపట్టడం జరిగింది. ఇంతేరు అక్రమ మీద విచారణ జరిపి అధికారులు ప్రశ్నిస్తుంటే పొంతన లేని సమాధానాలు చెప్తున్నారు అని పెడన నియోజకవర్గ జనసేన పార్టీ నాయకుడు యడ్లపల్లి. రామ్ సుధీర్ అన్నారు. అనుమతులు లేకుండా ట్రాక్టర్ మట్టి తవ్వుతుంటేనే నానా యాగీ చేసే రెవిన్యూ సిబ్బంది గాని, పోలీస్ అధికారులు గాని వేల ఎకరాలు అనుమతులు లేకుండా తవ్వేస్తుంటే ఎందుకు చూస్తూ ఊరుకున్నారని జనసేన పార్టీ ప్రశ్నిస్తోంది. అని అక్రమార్కులకు అధికారులు కొమ్ముకాస్తున్నారు అనడానికి నిదర్శనం. ఆక్రమణకు గురైన చెరువులకు విద్యుత్ కనెక్షన్లు, ట్రాన్స్ఫార్మర్లు, ఇవ్వడమే సి ఆర్ జెడ్ నిబంధనలు అటవీ చట్టాలను సైతం ఇక్కడ కాలరాశారు. మడ అడవులను మాయం చేశారు. పర్యావరణ సమతుల్యాన్ని దెబ్బతీస్తున్నారు. దీని వెనుక అధికార పార్టీతో పాటు ప్రతిపక్షానికి చెందిన బడా నాయకులు ఉన్నట్లు మా పరిశీలనలో వెలుగులోకి వచ్చిందని సుధీర్ అన్నారు. అందులో వంద ఎకరాలు కాన్సెప్ట్ బహిరంగంగా వినపడుతుం డగా కనపడని అక్రమాలు ఇంకా పెద్ద మొత్తంలోనే ఉన్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన పూర్తి వివరాలు మా దగ్గర ఉన్నాయని జనసేన పార్టీ తరఫున క్షేత్రస్థాయిలో వెలుగుచూసిన అంశాలు ఏ సర్వే నెంబర్లు ఎంత మొత్తం భూమి ఆక్రమణకు గురైంది. చెరువులు తవ్వడానికి అనుమతులు ఎవరు ఇచ్చారు. అనుమతులు లేకుండా వేల ఎకరాలు తీరప్రాంత తవ్వేస్తుంటే అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు..? తదితర అంశాలపై ఇప్పటికే ఒక నివేదిక రూపొందించడం జరిగిందని త్వరలో ఈ నివేదికను జనసేన పార్టీ అధిష్టానం అనుమతితో కృష్ణా జిల్లా కలెక్టర్ మరియు సంబంధిత శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళి పోతున్నాం. వారి నుంచి స్పందన కరువైంది పక్షంలో గ్రీన్ ట్రిబ్యునల్ లోను, హైకోర్టులో ను పిల్స్ దాఖలు చేసి న్యాయపోరాటం చేస్తామని దీని వెనుక ఎంతటి పెద్ద వారు ఉన్నా వదిలేది లేదని పెడన నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు యడ్లపల్లి రామ్ సుధీర్ హెచ్చరించారు.