నీలూరు గ్రామ కౌలు రైతు కుటుంబానికి లక్ష ఆర్థిక సహాయం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకు ఆర్థిక భరోసా ఇచ్చి అండగా నిలవాలనే ఉద్దేశంతో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అనంతపురం జిల్లాలో మంగళవారం ప్రారంభించిన రైతు భరోసా యాత్ర లో భాగంగా పామిడి మండలం, గజరాంపల్లి గ్రామ పంచాయితీ నిలురు గ్రామ వాస్తవ్యులు రావుల రత్నమ్మ కి లక్ష రూపాయల చెక్కును పవన్ కళ్యాణ్ అందజేశారు. రత్నమ్మ పవన్ కళ్యాణ్ గారి తో మాట్లాడుతూ.. తన భర్త కౌలుకు భూమిని తీసుకొని పత్తి వేశాడని, పంటలు సరిగా పండక వర్షాలు లేక అప్పులు చేసుకోవాల్సి వచ్చిందని, అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్నాడని, అప్పటి నుంచి ప్రభుత్వం ఎటువంటి సహాయం చేయలేదని.. కానీ ఇప్పుడు మీరు మా బాధను అర్థం చేసుకుని ఆత్మహత్యలు చేసుకున్న ప్రతి కౌలు రైతు కుటుంబానికి లక్ష రూపాయలు ఇచ్చి మాకు దేవుడిలా ఆత్మస్థైర్యాన్ని ఇస్తున్నారని పవన్ కళ్యాణ్ కు కంటతడి పెట్టుకుంటూ కృతజ్ఞతలు తెలియజేశారు చేశారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. మీకు ప్రభుత్వం నుంచి 7 లక్షల ఆర్థిక సహాయం అందే వరకూ జనసేన పోరాడుతుందని మా జనసేన నాయకులు మీకు అండగా ఉంటారని ఆమెకు ధైర్యాన్ని చెప్పారు.

కౌలు రైతు భరోసా యాత్ర కార్యక్రమంలో నీలూరు రైతు కుటుంబం పాల్గొనేలా చేసి.. అధ్యక్షులు వారి నుండి లక్ష రూపాయల చెక్కు అందజేసేలా ఏర్పాటు చేయడంలో జనసేన జిల్లా కార్యదర్శి వాసగిరి మణికంఠ, పామిడి మండల అధ్యక్షుడు ధనుంజయ, గుంతకల్ మండల అధ్యక్షుడు పురుషోత్తం ఎంతో బాధ్యతగా తోడ్పాటును అందించారు. అలాగే వారి కుటుంబానికి ప్రభుత్వం నుండి రావాల్సిన ఏడు లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా పరిహారం వచ్చే వరకూ.. కూడా జనసేన పోరాటం చేస్తుందని రైతు కుటుంబానికి అండగా భరోసానిచ్చారు.