యాదాద్రిలో వైభవంగా లక్ష్మీనరసింహస్వామి తిరుకల్యాణ మహోత్సవం

యాదాద్రి-భువనగిరి: యాదాద్రిలో లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. నేటి ఉదయం 11 గంటలకు బాలాలయంలో స్వామివారి తిరుకల్యాణ మహోత్సవం నిర్వహించనున్నారు. రాత్రి 7:30 గంటలకు పాత జెడ్పీ హై స్కూల్ గ్రౌండ్‌లో వైభవోత్సవ కల్యాణం జరుగనుంది. ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు. కళ్యాణ మహోత్సవాలకు పలువురు మంత్రులు హాజరు కానున్నారు. 10 వేల మంది కూర్చుని స్వామి వారి కల్యాణాన్ని తిలకించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. 200 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించారు.