భూసేకరణ తక్షణమే నిలుపుదల చేయాలి

డా.బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు, తీర ప్రాంత సొసైటీ భూముల పరిరక్షణ కమిటీ, రాజోలు నియోజకవర్గ పరిరక్షణ చైతన్య కమిటీ, తీర ప్రాంత పర్యావరణ పరిరక్షణ సమితి వారి ఆధ్వర్యంలో తీర ప్రాంత దళితులు సొసైటీ భూముల్లో ఏవిఆర్ గ్యాస్ అండ్ ఆయిల్ కంపెనీ ప్రభుత్వం చేపడుతున్న బలవంతపు భూసేకరణను తక్షణమే నిలుపుదల చేయాలి. భూసేకరణ కోసం సొసైటీ పాలకవర్గంపై ఒత్తిడులు అధికారులు మానుకోవాలి. చమురు-సహజవాయువుల తవ్వకాల కాలుష్యం నుండి మన తీరప్రాంతాన్ని కాపాడుకుందామని, విద్వాంసకర అభివృద్ధిని వ్యతిరేకిద్దామని, భవిష్యత్తు తరాలకోసం పర్యావరణాన్ని, సహజ సంపదలను కాపాడుకుందామని ముత్యాల శ్రీనివాసరావు అధ్యక్షతన బుధవారం పడమటిపాలెంలో ఏర్పాటు చేసిన అఖిల పక్ష నిరసన కార్యక్రమంలో పాల్గొన్న రాజోలు నియోజకవర్గ జనసేన నాయకులు డాక్టర్ రమేష్ బాబు, జనసేన నాయకులు బొంతు రాజేశ్వరరావు, ఉండపల్లి అంజి, రాపాక మహేష్, మేకల యేసు బాబు, విప్పర్తి సాయిబాబు, ప్రముఖ న్యాయవాది కొంకు నాగమణి, గెడ్డం బాలరాజు, పెదపాటి శ్యామ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజోలు జనసేన నాయకులు బొంతు రాజేశ్వరరావు మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా ఎటువంటి అనుమతులు రాకపోయినప్పటికీ, రైతులకు నోటీసులు ఇవ్వకుండా దళితుల సొసైటీ భూములను బలవంతంగా భూసేకరణ చేయడం చట్ట విరుద్ధమని తక్షణమే విరమించుకోవాలని రాజేశ్వరరావు బొంతు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ భూములను ఏవిఆర్ ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీకి అప్పగించడానికి జిల్లా అధికారులు బలవంతం చేస్తున్నారని వారికి ఎటువంటి నోటీసులు ఇవ్వలేదని బలవంతంగా లాక్కోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని భయాందోళనలో ఉన్నారు. ఏవిఆర్ ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీ ఇది ఒక్క డొల్ల సూట్ కేస్ కంపెనీ. ఏ.వి.ఆర్ కంపెనీ వారికి ఎస్సీ భూములును ఈ జగన్ ప్రభుత్వం అప్పగించాలని చూస్తుంది. చాలా దుర్మార్గం ఉన్నది. ఏవిఆర్ కంపెనీ వారు సర్వేను తక్షణమే నిలుపుదల చేయకపోతే బాధితులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు, రాజోలు నియోజకవర్గం పరిరక్షణ చైతన్య సమితి నాయకులు పాల్గొన్నారు.