భూముల క్రమబద్ధీకరణ విధాన నిర్ణయం

రాష్ట్రంలో మరోమారు ప్రభుత్వ భూములను క్రమబద్ధీకరించనున్నారు. ఇందుకు సంబంధించి త్వరలో ఉత్తర్వులు వెలువడనున్నాయి. ఇటీవల పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌తో భేటీ అయిన జీహెచ్‌ఎంసీ శివారు జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు.. ప్రభుత్వ భూములను క్రమబద్ధీకరించాలని విన్నవించిన విషయం విదితమే. వారి విజ్ఞప్తికి మంత్రి సానుకూలంగా స్పందించారు. ఆ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా భూముల క్రమబద్ధీకరణపై విధాన నిర్ణయం కోసం ఫైలు ప్రభుత్వానికి చేరింది. ఆ ఫైలుపై సీఎం కేసీఆర్‌ సంతకం చేయగానే క్రమబద్ధీకరణకు సంబంధించి జీవోలు వెలువడనున్నాయి.