టీజర్‌ ట్రీట్‌కి సమానంగా వకీల్ సాబ్ మోషన్ పోస్టర్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్  నటిస్తున్న వకీల్ సాబ్ టీజర్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మార్చ్ నెలలో విడుదలైన మగువా మగువా సాంగ్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. సెప్టెంబరు 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర బృందం మోషన్ పోస్టర్‌ను ఆవిష్కరించడానికి సన్నాహాలు చేస్తోందని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఎంతో కాలంగా పవర్ స్టార్ ఫ్యాన్స్ వకీల్ సాబ్ టీజర్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తుండటంతో ఈ మోషన్ పోస్టర్‌ని వారి అంచనాలకు తగినట్టుగా టీజర్‌ ట్రీట్‌కి సమానంగా ఉండేలా డిజైన్ చేస్తున్నట్టు సమాచారం. మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్. థమన్ కూడా తన ట్విట్ట్వర్‌లో “WED-NES-DAY” అని ట్వీట్ చేసి అభిమానులకు హింట్ ఇచ్చాడు.