గుంతకల్ నియోజకవర్గంలో గెలుపే లక్ష్యంగా జనసేన – టిడిపి పయనం

గుంతకల్ నియోజకవర్గం: వైసిపి అరాచక పాలనపై ఐక్య పోరాటం సాగిద్దాం అని జనసేన – టిడిపి ఆత్మీయ సమన్వయ సమావేశంలో టిడిపి ఇన్చార్జ్ మాజీ శాసనసభ్యులు జితేంద్ర గౌడ్ మరియు జనసేన – టిడిపి సమన్వయ బాద్యుడు వాసగిరి మణికంఠ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా జనసేన – టిడిపి చారిత్రాత్మకమైన కలయిక అని పేర్కొన్నారు. జనసేన, తెలుగుదేశం అధినేతల ఆదేశాలు మాకు శిరోధార్యం. గుంతకల్ నియోజకవర్గంలో గెలుపే లక్ష్యంగా జనసేన – టిడిపి పయనం ఉంటుంది. సమన్వయనంతో కలిసి పని చేద్దాం.. జనసేన – టిడిపి సంకీర్ణ ప్రజా ప్రభుత్వాన్ని స్థాపిద్దాం అని తెలిపారు.