కూకట్ పల్లి బూత్ కమిటీల నియామకం

తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఎలక్షన్స్ నేపథ్యంలో కూకట్పల్లి నియోజకవర్గంలో శుక్రవారం జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్ ని కూకట్పల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు కలవడం జరిగింది. ఇందులో భాగంగా అతి త్వరలో జరగబోయే నాలుగో విడత జనసేన పార్టీ నియోజకవర్గ కార్యక్రమాలకు సంబంధించిన వివిధ అంశములను చర్చించడం జరిగింది. అందులో భాగంగా నియోజకవర్గంలోని అన్ని బూత్ లకి కమిటీలను నియమించడం జరిగిందని వాటికి సంబంధించిన వివరాలు త్వరలోనే విడుదల చేస్తామని చెప్పడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో కొల్లా శంకర్, నాగేంద్ర, వెంకటేశ్వరరావు, గడ్డం నాగరాజు కిషోర్, మహేష్, పోలిశెట్టి సునీంద్ర, పండుగ సూర్య ముదిరాజ్, కలిగినీడి ప్రసాద్, ఎస్ కె నాగూర్, రతన్, ఆకాష్ రెడ్డి, వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.