కాశ్మీర్ చరిత్రను తెలుసుకుందాం

కాశ్మీర్ ఆహ్లాదకరమైన వాతావరణంతో అందంగా అలరారే ప్రాంతం. కాశ్మీరును భూలోకస్వర్గంగా పిలుస్తారు. కాశ్మీర్ అందం ముగ్ధ మనోహరం. పర్యాటకులకు స్వర్గదామం కాశ్మీరం. ఎటుచూసినా కమనీయ దృశ్యాలే అక్కడి చీనాచెట్లు, పైన్ చెట్లు, టులిప్ పూలు, మొఘల్ గార్డెన్స్, శ్రీనగర్ గుల్మార్గ్, పహల్ గావ్  ఇలా అందాలకు పుట్టిల్లు జమ్మూకాశ్మీర్. అయితే ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే. మరొకవైపు ఎప్పుడు అల్లరి మూకలు పెట్రేగిపోతాయో, ఎక్కడ బాంబుదాడులు అమాయకులను బలిగోoటాయో తెలియని పరిస్థితి. ప్రశాంతమైన కాశ్మీర్ రక్తపుటేరులుగా ఎందుకు మారుతుందో అసలు కాశ్మీర్ చరిత్ర ఏమిటి, భారత్ లో ఎలావిలీనమైoది అది ఇప్పుడు తెలుసుకుందాం. 
కాశ్మీర్ నేటి సమస్యను తెలుసుకోవాలంటే కొన్ని శతాబ్దాల వెనక్కి వెళ్లాల్సిందే 1586 నుంచి ఎక్కువగా కాశ్మీర్ చరిత్ర మనకు కనిపిస్తుంది. అంతకంటే రెండు దశాబ్దాల ముందుకు వెళ్ళి ఇప్పుడు మనం చరిత్రను తెలుసుకుందాం. కాశ్మీర్ రాజ్యానికి 1339 తొలి ముస్లిం పాలకుడు శామీర్ పాలకుడయ్యాడు. 1586 వరకూ ఆయన వంశస్థులే కొనసాగారు. అనంతరం మొఘలుల పాలనలోకి వెళ్ళింది. 1586 లో అక్బర్ చక్రవర్తి సైన్యం రాజా భగవాన్ దాస్ నాయకత్వంలో కాశ్మీర్ పాలకుడు యూసఫ్ ఖాన్ ను ఓడించింది. అపుడు రాజ్ బఘవాన్ దాస్ సోదరుడు రామ్ చిoద్రా ఆ ప్రాంతానికి అధికారిగా నియమితుడయ్యాడు. ఖచవాజట్  రాజపుత్ర జాతికి చెందిన ఆయన తమ కుల దేవత జమాయి మాత పేరుమీద జమ్ము నగరాన్ని స్థాపించాడు. 
ఇక్కడ స్థిరపడిన రాజపుత్రులను డోగ్రా రాజపుత్రులు అంటారు. 1586లో రాజ్యాన్ని ఆక్రమించిన మొగలులు 1751 వరకు పాలించారు. తర్వాత 1819 వరకు ఆఫ్ఘనిస్తాన్ దురానీలు పాలకులయ్యారు. ఆ తర్వాత పంజాబ్ సిక్కుల ఏలుబడిలోకి వెళ్ళింది. 1846లో జరిగిన తొలి ఆంగ్లోసిక్కు యుద్ధంలో మహారాజా రంజిత్ సింగ్ ఓడిపోవడంతో ఈ ప్రాంతం చరిత్ర పూర్తిగా మారిపోయింది. ఆంగ్లేయులు సిక్కుల మధ్య జరిగిన అమృత్సర్ ఒప్పందం ప్రకారం అంత వరకూ రంజిత్ సింగ్ రాజ్యాగంలో బాగంగా ఉన్న కాశ్మీర్ ను జమ్మూ మహారాజు అయిన డోగ్రా వంశానికి చెందిన గులాబ్ సింగ్ కు 75 లక్షలకు  బ్రిటిష్ ప్రభుత్వం విక్రయించింది. ఆ విధంగా జమ్ముకాశ్మీర్ రాజ్యం ఏర్పడింది. రాజ్యాన్ని అమ్మేసినప్పటికీ సంరక్షణ బాధ్యతను మాత్రం బ్రిటిష్ ప్రభుత్వమే చూసుకునేది. పన్నుల విధింపు తదితర అధికారాలు మాత్రమే మహారాజుకుఉండేవి. అనంతరం ఆయన కుమారుడు రణవీర్ సింగ్ రాజయ్యాడు. రణవీర్ సింగ్ వారసత్వ పరంపరలో బాగంగా అయన మనుమడు హరిసింగ్ 1925లో కాశ్మీర్ పాలన చేపట్టారు.
అదేసమయంలో దేశమంతా నెలకొన్న భారత స్వాతంత్రఉద్యమ ప్రభావం ఈ రాజ్యంపై పడింది. రాజ్యంలో తమ సంఖ్య అధికంగా ఉన్నప్పటికీ తమకు ప్రభుత్వ ఉద్యోగాలలో ప్రాధాన్యత లభించడం లేదనే అభిప్రాయంఅక్కడి ముస్లింలలో నెలకొంది. దీనిపై సాగిన ఆందోళనకు షేక్అబ్దుల్లా నాయకత్వంవహించారు. దీనికితోడు పన్నుల బారానికి వ్యతిరేకంగా పూంచ్ లో ఉద్యమం ప్రారంభమైంది. పూంచ్ తిరుగుబాటుదారులు పొరుగున ఉన్నఆఫ్ఘన్ లోని ఫస్తున్ గిరిజనుల సహాయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో స్వతంత్రo సిద్ధించింది. ఇటు భారత్ లోనో అటు పాకిస్థాన్ లోనో విలీనం కావలసిన పరిస్థితులు సంస్థానాధీశులకు ఎదురైంది. స్వతంత్రంగా ఉండాలని హరిసింగ్ అనుకున్నా అందుకు అవకాశం లేకపోయింది. పాక్ లో చేరాలన్న ఆందోళనలు జరగగా అవి పోలీసు కాల్పుల వరకూ దారితీశాయి. పరిస్థితి చక్కబడిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటాం అంటూ హరిసింగ్ 1947లో పాకిస్తాన్ తో యధాపరిస్థితి ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు. వాణిజ్యం రవాణా కమ్యూనికేషన్ ఇతర రంగాలలో పరస్పరం సహకరించుకోవాలి అనినిర్ణయించారు. విలీనంపై హరి సింగ్ తాత్సారం చేస్తున్నారని బావించిన పాకిస్థాన్  1947 అక్టోబర్ లో గిరిజనులను ప్రోత్సహించి దాడి చేయించింది. సహాయం చేయాలని ఆయన భారత ప్రభుత్వాన్ని ఆశ్రయించారు. విలీనం చేయడానికి ఒప్పుకుంటేనే సహకరిస్తామని చెప్పడంతో అందుకు అంగీకరించారు. భారత సైన్యం వెళ్లడంతో గిరిజనులు వెనక్కి తగ్గారు.  గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రాంతాలు పాక్ ఆదీనం లోనే లోనే ఉండి పోయాయి. బారత్ లో విలీనం కావాలన్న నిర్ణయంపై పాకిస్తాన్ అభ్యంతరం తెలిపి ఆగ్రహం వ్యక్తం చేసింది. తమతో యధాతథ స్థితి ఒప్పందాన్ని ముందుకు తెచ్చింది. హరి సింగ్ సంతకం చేయడానికి ముందే భారత సైన్యాలు ప్రవేశించాయని అందువల్ల ఇది దురక్రమమే అని వాదించింది. కాశ్మీర్ విలీనం చేసిన తర్వాతే తమ సైన్యాలు వెళ్ళాయి అని భారత్ స్పష్టం చేస్తూ వస్తోంది. 1947 జనవరి 1న తేదీన రెండు దేశాల మధ్య నియంత్రణ రేఖ నిర్ణయించారు ఇదే ప్రస్తుతం ఇరు దేశాల మధ్య సరిహద్దుగా కొనసాగుతుంది. 1947 అక్టోబర్ 26న హరిసింగ్ భారత్ లో విలీన ఒప్పందంలో సంతకం చేశారు. దీనిపై మరుసటి రోజునే  అప్పటి గవర్నర్ జనరల్ మౌంట్ బాటెన్ సంతకం చేశారు. ఈ సందర్భంగా ఆయన ఉత్తర్వులు జారీ చేస్తూ జమ్మూ కాశ్మీర్లో శాంతిభద్రతలు నెలకొన్న తరువాత దురాక్రమణ దారులు తిరిగి వెళ్ళిపోయిన అనంతరం ప్రజలను సంప్రదించిన పిదప రాష్ట్ర విలీన సమస్య పరిష్కారం అవుతుందని నా ప్రభుత్వం ఆశిస్తుoదని పేర్కొన్నారు. ఆక్రమిత కాశ్మీర్ తిరిగి స్వాధీనం అయిన తర్వాతే ప్రజాభిప్రాయ సేకరణతో ఇతర అంశాలను పరిశీలించాలన్నది మౌంట్ బాటెన్  యొక్క అభిప్రాయం గా కనిపించింది. అయితే ఈ విలీనం తాత్కాలికం మాత్రమే అని షేక్ అబ్దుల్లా అప్పుడే ప్రకటించారు. కాశ్మీర్ ను విడచి పెట్టి రావాలని హరిసింగ్ ను ఆదేశించిన ప్రభుత్వం అనంతరం షేక్ అబ్దుల్లా ఆధ్వర్యంలో అత్యవసర ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. సమస్య తీవ్రతను గుర్తించి రాజ్యాంగ సభ కూడా కాశ్మీర్కు స్వయం ప్రతిపత్తిని ఇచ్చింది. అందులో భాగంగానే 370వ అధీకరణo వంటి రక్షణలు కల్పించింది. ఆర్టికల్ 370 ప్రకారం జమ్మూకాశ్మీర్ కు ప్రత్యేక హక్కులు కల్పించారు. కానీ అప్పట్లో ఆరాష్ట్రానికి ప్రత్యేక రాజ్యాంగం ఉండాలని డిమాండ్ చేశారు. 1951లో రాష్ట్రాన్ని రాజ్యాంగ సభ నుండి వేరుగా పిలవడానికి అనుమతించారు. 1956 నవంబర్ లో రాష్ట్ర రాజ్యాంగం ఏర్పాటు పూర్తి అయ్యింది. 1957జనవరి 26న రాష్ట్రానికి ప్రత్యేక రాజ్యాంగం అమలులోనికి వచ్చింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 నిజానికి కేంద్రం నుంచి జమ్ముకాశ్మీర్ సంబందాలకు రూపురేఖలుగా ఉంటుంది. ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ షేక్ మహమ్మద్ అబ్దుల్లా ఐదు నెలలు చర్చించిన తర్వాత ఆర్టికల్ 370ని రాజ్యాంగంలో జోడించారు. ఆర్టికల్ 370 నిబంధనల ప్రకారం రక్షణ, విదేశాంగ విధానం, కమ్యూనికేషన్ అంశాల మినహా వేరే అంశానికి సంబంధించిన చట్టం అమలు చేయాలన్నా కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రత్యేక హోదా కారణంగానే జమ్మూకాశ్మీర్ రాష్ట్రాలపై రాజ్యాంగంలోని ఆర్టికల్ 356 అమలు చేయడం కుదరదు. దాని వలన భారత రాష్ట్రపతి దగ్గర రాష్ట్ర రాజ్యాంగాన్ని రద్దు చేసే హక్కు ఉండదు. ఆర్టికల్ 370 కారణంగా జమ్మూకాశ్మీర్కు ప్రత్యేక జెండా కూడా ఉంటుంది. దానితోపాటు జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ కాలపరిమితి ఆరుసంవత్సరములు ఉంటుంది. ఆర్టికల్ 370 కారణంగా భారత రాష్ట్రపతి జమ్ముకాశ్మీర్ లో అత్యవసర పరిస్థితి విధించడం సాధ్యంకాదు. అయితే ఎన్ని ఆర్టికల్స్ తెచ్చినా  భారత్ తో  కాశ్మీర్ కు ఒప్పందం ఉన్నా పాక్ మాత్రం కాశ్మీర్ తమదే అని వాదిస్తుంది అయితే 1947 ఆగస్టు 15 నాటికి జమ్మూ కాశ్మీర్ వాస్తవానికి ఓ ప్రత్యేక దేశంగానే ఉండేది. ఈ ఏడాదే మూడోవంతు బాగం పాకిస్తాన్ పరమైంది. ఇక్కడ సరిహద్దు వివాదం తేలక పోవడంతో తాత్కాలిక సరిహద్దును నియoత్రణ రేఖ గా పిలుస్తున్నారు. 1962 లో అక్సాయ్ చిన్ ప్రాంతాన్ని చైనా ఆక్రమించుకుంది. జింగైసాన్ స్వయం ప్రతిపత్తి ప్రాంతం లోని ఒక బాగమని అంటుంది. ఇక్కడ తాత్కాలిక సరిహద్దు రేఖను వాస్తవాదిన రేఖగా వివరిస్తున్నారు. అది పోను మిగిలిన బాగమే భారత్ వాస్తవ అధికారంలో ఉంది. కాశ్మీర్ విలీన సమయంలో ఎదురైన సంఘటనలు భారత్ పాక్ మధ్య యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తూనే ఉన్నాయి. ఈ విషయమై ఇంతవరకు భారత్-పాక్ ల మధ్య నాలుగు యుద్ధాలు జరిగాయి.
1947లో జరిగిన యుద్ధం మొదటిది కాగా, 1965లో జరిగినది రెండవది. వేర్పాటువాదాన్ని ప్రోత్సహించడానికి పాక్ సైనికులను రహస్యంగా కశ్మీర్కు పంపించింది. ఈ చొరబాటు దారుల ను ఎదుర్కొనడానికి  భారత్  భారీయుద్ధమే చేసింది. 17 రోజులు పాటు జరిగిన ఈ పోరు రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జరిగిన అతి పెద్దది కావడంతో ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. రష్యా లోని తాష్కెంట్ లో కుదిరిన ఒప్పందం కారణంగా యుద్ధవిరమణ జరిగింది. 
1971లో జరిగిన మూడవ యుద్ధం ప్రత్యక్షంగా కాశ్మీర్ కు సంబంధించినది కాకపోయినా ఆ రాష్ట్ర ప్రమేయం ఉంది. బంగ్లాదేశ్ ఏర్పాటు కోసం జరిగిన ఈ యుద్ధంలో భారత్ సేనలు ఆక్రమిత కాశ్మీర్ తో పాటు పంజాబ్ సిందు ప్రవేశ్ లోని 15,010 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని స్వాధీనంలోకి తెచ్చుకున్నాయి. 90 వేల మంది సైనికులను యుద్ధ ఖైదీలుగా పట్టుకున్నాయి. అయితే అప్పటికే జోన్ లో ఉన్న బంగ్లాదేశ్ నిర్మాత ముజువర్ రహమాన్ ను ఉరి వేయడానికి ఏర్పాటు చేయడం. అంతర్ జాతీయ సూచనల మేరకు ఈ భూభాగం తిరిగి ఇవ్వవలసిన పరిస్థితివచ్చింది. సిమ్లా ఒప్పందం మేరకు అప్పగింత జరిగింది. ఈ యుద్ధంలో పాక్ సగం నౌకా దళాన్ని, నాలుగవ వంతు వైమానిక దళాన్నీ, మూడు వంతుల సైన్యాన్ని నష్టపోయింది. 
1999లో కార్గిల్ విషయమై యుద్ధం జరిగింది. ఒక్క పాక్ తోనే కాక జమ్మూకాశ్మీర్ సరిహద్దులపై 1962లో చైనాతో యుద్ధం జరిగింది. ఈ సరిహద్దులకు కాశ్మీర్ పాలకుడు గులాభ్ సింగ్ సంబంధం ఉంది. 1842 ఆయన టిబెట్ ఆక్రమణకు వెళ్ళినప్పుడు యుద్ధం జరగకుండా వారితో ఒప్పందం కుదిరింది. లడఖ్ ను సరిహద్దుగా నిర్ణయించుకున్నారు అయితే చైనా టిబెట్ ను ఆక్రమించుకున్న తర్వాత ఆ ప్రాంతమంతా తమదేనంటూ యుద్ధానికి దిగింది. 37,555 చదరపు కిలోమీటర్ల మేర ఆక్ సైచిన్ ప్రాంతాన్ని స్వాధీనంలోకి తీసుకుంది. అప్పటి నుండి ఆ ప్రాంతం చైనా ఆధీనంలోనే ఉండిపోయింది. కాశ్మీరులోయతో పాటు జమ్మూ,లడఖ్  ప్రాంతాలు భారత్ ఆధీనంలో ఉన్నాయి. ఇవి భారత ప్రభుత్వం లో విలీనమైన ఆర్టికల్ 370 కాశ్మీర్ కి ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తుంది. అందులో భాగమైన ఆర్టికల్ 35A అక్కడి పౌరులకు ప్రత్యేక ప్రతిపత్తి అందిస్తుంది. దీంతో అక్కడి పరిస్థితులను కొన్ని విషయాలలో భారత ప్రభుత్వం నియంత్రించుకోలేక పోతుంది. కాశ్మీర్ లో సుస్తిరత తీసుకు రావాలంటే. ఆర్టికల్ 370 రద్దు తప్పదని బావించిన ప్రస్తుత ప్రభుత్వం ఆర్టికల్ 370 ని రద్దు చేసింది. దీనివలన కాశ్మీర్ లో కొన్నిమార్పులు చోటు చేసుకోనున్నాయి. ఇంతకుముందు శాశ్వత నివాసులుగా రాష్ట్రంలోఉన్నవారు మాత్రమే ఆస్తులు కొనుగోలు చేయగలిగేవారు, ఇప్పుడు ఎవరైనా అక్కడ ఆస్తులు కొనుగోలు చేయవచ్చు. గతంలో శాశ్వత నివాసం ఉన్న వారు మాత్రమే ప్రబుత్వ ఉద్యోగాలలో నియమించే వారు ఇప్పుడు ఎవరిని అయినా నియమించవచ్చు. ఇక్కడ శాంతిభద్రతలు ముఖ్యమంత్రి అదుపులో ఉండేవి, ఇప్పుడు రాష్ట్ర ప్రతినిధి అంటే లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా ఇది నేరుగా కేంద్ర హోంమంత్రి పరిధిలోని కి వస్తాయి. కేంద్రం రూపొందించిన చట్టాలు అన్నింటిని కేంద్రం ఇంతకుముందు రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించాల్సి వచ్చేది,ఇప్పుడు అది ఆటోమేటిక్ గా అమలులోనికి వస్తాయి. అలాగే ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా ఇక్కడ నేరుగా అమలు అవుతాయి. రాష్ట్ర ప్రభుత్వం అజెండాకు ఇప్పుడు ప్రాధాన్యత ఉండదు. ప్రస్తుతం ఉన్న దానిని ఏం చేయాలని పార్లమెంట్ లేదా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. రాష్ట్ర అసెంబ్లీ కాలపరిమితి 6 సంవత్సరముల నుండి 5 సంవత్సరాలకు తగ్గిస్తారు. మహిళలకు వర్తించే సాంప్రదాయక వ్యక్తిగత చట్టాలను తొలగిస్తారు. ఇక్కడ ఐపిసి అమలు చేయాలా లేక స్థానిక రణబీర్ పీనల్ కోడ్ అమలు చేయాలా  అనేది కేంద్ర ప్రభుత్వం లేదా పార్లమెంట్ నిర్ణయిస్తుంది. మొత్తంగా కొన్ని కీలక పరిణామాలు వేదికగా నిలచిన కాశ్మీర్ ఇప్పుడు మరో నూతన అధ్యాయం లోనికి అడుగు పెట్టింది. ఇక ఫై నైనా  కల్మషం లేని అలనాటి అందాల కాశ్మీర్ గా నిలిచిపోవాలని కోరుకుందాం.