డిసెంబర్ 23న ‘జాతీయ రైతు దినోత్సవం’ వేడుకలు ఇలా చేద్దాం

జాతీయ రైతు దినోత్సవం పురస్కరించుకుని డిసెంబర్ 23న జన సైనికులు, వీరమహిళలు రైతులతో మమేకమయ్యేందుకు గ్రామాల్లోని వ్యవసాయ భూములను సందర్శిద్దాం అని జనసేన పీఏసీ సభ్యులు శ్రీ కొణిదెల నాగబాబు ఒక ప్రకటనలో తెలిపారు.
*రైతులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి రైతులతో చర్చించి తెలుసుకుందాం.
*జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలు సమష్టిగా ఏర్పడి స్థానిక రైతులతో సమావేశాలు, ర్యాలీలు నిర్వహించి శ్రీ పవన్ కళ్యాణ్ గారు రైతాంగం కోసం పరితపిస్తున్న విధానాన్ని వివరిద్దాం.
*జనసేన పార్టీ అధికారంలోకి వచ్చాక వ్యవసాయాన్ని లాభసాటిగా చేసే విధానాలను గురించి అందరికీ తెలియజేసి, రైతు సంక్షేమం కోసం జనసేన పని చేస్తుందనే భరోసా రైతులకు కల్పిద్దాం.
*ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాల్లో భరోసా నింపేందుకు జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ‘కౌలు రైతు భరోసా యాత్ర’లో 3 వేలకు పైగా కుటుంబాలకు ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తున్న దాని గురించి అందరికీ తెలియజేసే విధంగా ప్రచారం చేద్దాం.
*రైతులు, రైతు కుటుంబాల కోసం పరితపిస్తున్న జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రణాళికలకు మద్దతుగా రైతు పొలాల్లో రైతు అనుమతితో జనసేన జెండాలను ప్రదర్శిద్దాం అని కొణిదెల నాగబాబు వివరించారు.