గుంతకల్ నియోజకవర్గంలో జనసేన జెండా ఎగరవేద్దాం: బండి శేఖర్

గుంతకల్ నియోజకవర్గం: గుంతకల్ నియోజకవర్గ అభివృద్ధి మన చేతిలో గుంతకల్ జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు బండి శేఖర్ పేర్కొన్నారు. ఆయన శనివారం విలేకరులతో మాట్లాడుతూ..గుంతకల్ ప్రాంతంలో దాదాపుగా మూడు లక్షల జనాభా కలిగిన నియోజకవర్గంలోనే దాదాపుగా 2 లక్షలు పైగా ఓటర్ సంఖ్య ఉన్న నియోజకవర్గం. ఇంతటి జనాభా ఉన్న నియోజకవర్గ ప్రాంతంలో ఇక్కడ చెప్పుకోవటానికి ఒకటే ఒకటి రైల్వే జంక్షన్ అది తప్ప మరొకటి భూతద్దంలో చూసినా కూడా జనాభా తప్ప ఏమి అభివృద్ధికి నోచుకోని నియోజకవర్గం మాది. ఇక్కడ దశాబ్దాలుగా ఒక చరిత్ర ఉంది అది ఏమిటంటే గుంతకల్ నియోజకవర్గం ఏ పార్టీ అయినా గాని ఎమ్మెల్యే గెలిస్తే పైన చెప్పిన విధంగా అధికారంలో అదే పార్టీ ఉంటుంది. అంతటి సెంటిమెంటు ఉన్న నియోజకవర్గం మాది, నియోజకవర్గం ఏ ఎమ్మెల్యే గెలిచిన అదే అధికారంలో ఉంటుంది అయినా కానీ నియోజకవర్గ అభివృద్ధి శూన్యం. ఈ నియోజకవర్గ యువత బీఈడీ, డిగ్రీలు, చదివి పొట్ట చేతిలో పట్టుకుని వేరే రాష్ట్రాలకు వెళ్లి బ్రతుకు జీవనం కొనసాగిస్తూ ఉంటారు మరి కొందరైతే అంత చదువు చదివి రైల్వే జంక్షన్ లోన కళాసి పని చేసుకుని మరి కొంతమంది అయితే ప్లాట్ఫారం మీద టీ అమ్ముకుంటూ బ్రతుకు జీవనం కొనసాగిస్తుంటారు. మరి కొంతమంది అంతటి చదువు చదివి చాలీచాలని జీతాలతో ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లలోను మరీ కొంతమంది డిజిటల్ మాల్స్ లోన కూలి నాలి చేసుకుంటూ జీవనం కొనసాగిస్తుంటారు. మరి కొంతమంది మహిళలు అయితే గార్మెంట్స్ లో, కిరాణా మాల్స్ లో కూలి పని చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ తిమ్మాపురం ఎస్టేట్ సమీపంలో కొన్ని ప్రవేట్ ఫ్యాక్టరీలలోన లేబర్ ఆక్ట్ ప్రకారం డైలీ మూడు షిఫ్ట్ డ్యూటీ ఉండాలి కానీ ఇక్కడ రెండు షిఫ్ట్ డ్యూటీ మాత్రమే ఉంటాయి ఉదయం ఆరు నుండి సాయంత్రం 6 వరకు ఒక షిఫ్ట్ మరి సాయంత్రం 6:00 ఉదయం 6:00 వరకు రెండో షిఫ్ట్ అంతే గవర్నమెంట్ రూల్స్ రికార్డ్ ప్రకారం మూడు షిఫ్ట్ రికార్డులోమెన్షన్ చేసుకుంటూ ఇక్కడ కూలీ నాలి చేసుకునే లేబర్ కార్మికుల రెక్కల కష్టాన్ని వీళ్ళు సంపాదనగా మార్చుకుంటూ వెళ్తున్నారు. ఇక్కడ ఉపాధి లేక చేసేది ఇంకా ఏమీ లేక చాలీచాలని జీతాలతో కుటుంబ భారాన్ని మోస్తూ బ్రతుకు జీవనం కొనసాగిస్తున్నారు. నేను ఒకటే ఒకటి చెప్తున్నాను ఈ నియోజకవర్గ ప్రజలకు ఇన్నాళ్లు పార్టీలు వేరు రంగులు వేరు మరి ఇప్పుడొచ్చే ఎన్నికల్లో 2024 లో జనసేన పార్టీకి అధికారం ఇచ్చి చూడండి ఇదే నియోజకవర్గంలో అభివృద్ధి అనేది చేసి చూపెడుతూ వేరే రాష్ట్రాలకు వెళ్లి బ్రతుకు జీవనం కొనసాగిస్తున్నటువంటి వారందరికీ ఇక్కడే జీవించుకునే అంత పని వేతనాన్ని కల్పిస్తామని హామీ ఇస్తాము ఈరోజు దాదాపుగా 1991 నుండి నేటి వరకు మూతపడి ఉన్న దాదాపుగా 65 ఎకరాలపై చిలుకు విస్తీర్ణంలో ఉన్న ఆసియా ఖండంలోనే అతిపెద్ద జవాహర్ లాల్ నెహ్రూ బుధవారం 26 డిసెంబర్ 1951 ప్రారంభించిన ది మెడ్రాస్ కో ఆపరేటివ్ స్పిన్నింగ్ మిల్ దాదాపుగా గతంలో వేలాదిమంది బ్రతుకుల్లో సంతోషం చూసినటువంటి ఈ స్పిన్నింగ్ మిల్ ప్రభుత్వాలు మారిన ఈ రాజకీయ నాయకులు ఎన్నికల ముందు మిల్లు తెరిపిస్తామని మేనిఫెస్టోలో పెట్టుకునేకే మాత్రం పనికి వస్తున్నారు‌ నియోజకవర్గం ప్రజలారా ఎలక్షన్ల ముందర దొంగ హామీలు దొంగ మేనిఫెస్టోలో పెట్టుకొని ఓటుకు నోటు రూపంలో మమల్ని మబ్బి చూపి మాయ చేసి నాయకులను నమ్మకండి ఇంకా ఆలోచించండి ఇన్నాళ్లు ఒక ఎత్తు, ఇప్పుడు ఒక ఎత్తు
ముఖ్యంగా ఏళ్ల తరబడి మూతపడిన స్పిన్నింగ్ మిల్లు ని వెంటనే జనసేన పార్టీ అధికారంలోకి రాగానే వేలాదిమంది యువతకు ఉపాధి కల్పించి, 65 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి స్పిన్నింగ్ మిల్లు ఇండస్ట్రియల్ గార్మెంట్స్ఏరియాగా ఏర్పర్చి కొన్ని ప్రైవేట్ కంపెనీలో ఒప్పందం కుదుర్చుకొని గుంతకల్ నియోజకవర్గం యువతకు ఉపాధి కల్పిస్తూ‌, అభివృద్ధికి పాటుపడుతామని తెలియజేస్తున్నాను. ఇదొక్కసారి ఈ గుంతకల్ నియోజకవర్గంలో జనసేన జెండా ఎగరవేసే విధంగా ఇక్కడ ప్రజలు పాటుపడి, శ్రీ గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారిని మన రాష్ట్ర ముఖ్యమంత్రిని చేసుకుందాం అని కోరుతున్నామని, మన గుంతకల్ నియోజకవర్గం మన అభివృద్ధి మన చేతిలోనే ఉందని బండి శేఖర్ పేర్కొన్నారు.