జనసేన- తెలుగుదేశం పొత్తును విజయవంతం చేద్దాం

నెల్లిమర్ల నియోజకవర్గం: నెల్లిమర్ల మండలంలోని చిన్నపురాటపేట పంచాయతీలో జనసేన- తెలుగుదేశం పార్టీల ఉమ్మడి అభ్యర్థి శ్రీమతి లోకం మాధవి స్థానికంగా పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగు తమ్ముళ్లు, జనసైనికులు, వీరమహిళలు శ్రీమతి లోకం మాధవిని ఘనంగా స్వాగతించారు. ఎన్నికలవేళ లోకం మాధవి పర్యటనతో గ్రామంలో జనసేన టిడిపి కార్యకర్తలు కేరింతల కొడుతూ మాధవి గారితో ప్రతి వీధి పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా శ్రీమతి లోకం మాధవి ఇరుపార్టీల కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ రాబోయేది జనసేన తెలుగుదేశం ప్రభుత్వమేనని, ఈ యొక్క కొత్త కలయిక బంగారు భవిష్యత్తుకి నాంది పలకనుందని తెలియజేశారు. గ్రామం గురించి మాట్లాడుతూ తనకు ఎంతో సానిహిత్యం ఉన్న పంచాయతీ చిన్న బూరాడ పేట అని ఎన్నోసార్లు ఈ గ్రామంలో పర్యటించారని రైతుల కష్టాలు, వారికి అండగా నిలిచానని తెలియజేశారు. మన ప్రభుత్వం వచ్చాక ప్రతి రైతన్నకు మేలు జరిగేలా పంటకు గిట్టుబాటు ధర వచ్చేలా చొరవ తీసుకుంటానని తెలిపారు. తనకి వచ్చిన ప్రతి రూపాయి ప్రజల కోసమే ఖర్చు పెడతానని, ప్రజా శ్రేయస్సు కోసమే పాటుపడతానని మాధవి ప్రజలకు తెలియజేశారు.