“నా సేన కోసం… నా వంతు” కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం: వాసగిరి మణికంఠ

గుంతకల్ నియోజకవర్గం, గుత్తి పట్టణంలో జనసేన పార్టీ తలపెట్టిన “నా సేన కోసం నా వంతు” కార్యక్రమాన్ని గుంతకల్ నియోజకవర్గ వ్యాప్తంగా జయప్రదం చేయాలని అనంతపురం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి వాసగిరి మణికంఠ పిలుపునిచ్చారు. ఈ మేరకు గురువారం గుత్తి పట్టణంలో జిల్లా, మండల, పట్టణ ముఖ్య సమావేశమై చర్చించారు. తదనంతరం జనసేన నాయకులు మాట్లాడుతూ రాజకీయాల్లో క్రౌడ్ ఫండింగ్ రాజ్యమేలాలి, అదే రాజకీయ అవినీతికి విరుగుడు, రాజకీయ ప్రక్షాళనకు ఇదే నాంది అని. వ్యక్తికి వ్యక్తికి మధ్య జరిగే లావాదేవీలు ఎప్పుడూ ఒకరి ప్రయోజనం కోసం మరొకరు అన్నట్లు ఉంటాయి. ఒక సిద్ధాంతం కోసం భావజాలాన్ని నమ్మి ఒక సమూహం మొత్తం ముందుకు వెళ్తే అది పెనుమార్పులకు నాంది పలుకుతుంది. రాజకీయాల్లో క్రౌడ్ ఫండింగ్ ద్వారా పార్టీలో బలమైన భావజాలాన్ని బాధ్యతను ప్రతి ఒక్కరు పంచుకునే అవకాశం ఉంటుంది అని అందువల్ల ఈ కార్యక్రమాన్ని నిస్వార్థ జనసైనికుల సహకారంతో జనసేన పార్టీ గుంతకల్లు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతిష్ఠాత్మకంగా ముందుకు తీసుకెళ్తామని పేర్కొన్నారు. ఇందులో భాగంగా గుత్తి మండల అధ్యక్షులు చిన్న వెంకటేశ్వర్లు జనసేన పార్టీకి 2,116 రూపాయలు, పలు మొబైల్ షాప్ యజమానులు మరియు వర్తకులు పార్టీ బ్యాంక్ ఖాతా కు అనుసంధానమైన 7288040505 నెంబర్కు విరాళాలు అందించారు. ఈ కార్యక్రమంలో గుత్తి మండల, పట్టణ అధ్యక్షులు చిన్న వెంకటేశులు, పాటిల్ సురేష్, పామిడి మండల అధ్యక్షుడు ఎం.ధనుంజయ, నాయకులు వెంకటపతి నాయుడు, రమణ, మంజు, జయరాజు, అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.