వాలంటీర్లను రెచ్చగొడుతున్నారు: నందలూరు జనసేన

  • వాలంటీర్ల నిరసనను ఖండిస్తూ నందలూరు జనసేన నిరసన

రాజంపేట, శుక్రవారం నందలూరు మండల వాలంటీర్లు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పై తెలిపిన నిరసనను ఖండిస్తూ వాలంటీర్లు నిరసన తెలిపిన అంబేడ్కర్ విగ్రహం ముందర శనివారం నందలూరు జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిరసనగా అంబేడ్కర్ విగ్రహనికి పాలాభిషేకం చేసి వాలంటీర్ లు మాట్లాడిన అబద్ధాలకు ఆయనని పాలతో సుద్ది చేసి, పూల మాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం పవన్ కళ్యాణ్ చిత్రపటానికి కూడా పాలతో అభిషేకం చేసి వాలంటీర్ లు మాట్లాడిన మాటలను నందలూరు జనసేన నాయకులు ఖండించడం జరిగింది. ఈ సందర్భంగా ఉమ్మడి కడప జిల్లా ప్రోగ్రామ్ కమిటీ కార్యవర్గ సభ్యులు గురివిగారి వాసు మాట్లాడుతూ.. ఏ వ్యవస్థలో ఐన మంచి, చెడు ఉంటాయి అని పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్ వ్యవస్థలో జరగుతున్న తప్పిదాలను ఎత్తిచూపారు మంచి చేస్తున్న వారిని ఏమి అనలేదు, కొందరు వాలంటీర్ లు ప్రజల డేటా అల్లరి మూకలకి, రౌడీలకి ఇవ్వడం వలన మన స్టేట్ లో అమ్మాయిల మిస్సింగ్ కేసులు ఇలా చాలా జరుగుతున్నాయి. ఇంకా ఎన్నో ఆకృత్యాలు జరుగుతున్నాయి అని చెప్పారు. ఎవరిని కించపరచాలా అని వైయస్సార్సీపీ వారు కొందరు ఆ మాటలను వక్రీకరించి వాలంటీర్లను రెచ్చగొడుతున్నారు. ఇంకా ఆయన వాలంటీర్లకు ఐదువేలు ఏమి సరిపోతుంది వారికి ఇంకొ ఐదువేలు అదనంగా ఇచ్చినా సరిపోదు డిగ్రీలు, పీజీలు, బీటెక్ లు చదివి ఐదువేలకు పని చేస్తుంటారు. వారి శ్రమకు తగిన ఫలితం లేదు, వారి వద్ద వ్యట్టి చాకిరీ చేయించుకుంటున్నారు. వారి శ్రమ దోపిడీ చేస్తున్నారు అని వారి గురించి ప్రస్తావిస్తూ బాధపడ్డారు. ఈ కార్యక్రమంలో ఎర్రిపాపల్లి సుబ్బు, సాయి పవణ్, తిప్పాయిపల్లి ప్రశాంత్, పాటూరుడాల, మండెంరాము, ఉపేంద్రా, సాయి రాజు, మురళి పాటూరు, హరీష్, షైక్ షాకీర్, బాషా, పెట్టగడ్డ మస్తాన్ రాయల్, లక్ష్మీ నారాయణ, అంజి, శివ, మల్లి దాసరగడ్డ, యర్రా శ్రీను, మంకు వెంకటేష్ తదితరుల పాలుగొన్నారు.