పెద్దలను గౌరవిద్దాం- ఆదరిద్దాం

దర్శి: ప్రపంచ వృద్ధుల దినోత్సవం సందర్భంగా ఆదివారం పొదిలి జూనియర్ కాలేజీలో నవ్వులు పువ్వుల వాకర్సు సంఘం ఆధ్వర్యంలో వృద్ధుడైన మాచ భక్తుని గోవిందయ్య రిటైర్డ్ తెలుగు పండిట్, షేక్ మదార్ వలి, మూసా జానీ, భాషా మొహిద్దిన్, జిలాని, ఖాదర్ బాషా, సైదాల ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించడమైనది. ఈ కార్యక్రమంలో షేక్ మదార్ వలి మాట్లాడుతూ.. కని, పెంచి బుద్ధులు నేర్పించిన తల్లిదండ్రులను వృద్ధాప్యంలో కొందరు పిల్లలు సరిగ్గా చడం లేదని, ఆస్తి కోసం వారిపై దాడులకు తెగబడుతున్నారని, వృద్ధ తల్లిదండ్రుల రక్షణ కోసం చట్టం ఉన్నా వారిపై పౌరుల్లో అవగాహన కొరవడింది అన్నారు. సుఖమయ జీవితానికి ఎల్లప్పుడూ నవ్వుతూ బతకాలని, కోపం అహంకారం ద్వేషం వదులుకోవాలని, ప్రతిరోజు వ్యాయామం చేస్తూ ఆరోగ్య నియమాలు పాటించాలని, పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ గడపాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ సభ్యులు కరీముల్లా బేగ్, జావేద్, షూకూర్, అల్లూరయ్య, లక్ష్మి, బుర్రి శ్రీను తదితరులు పాల్గొన్నారు.