పల్నాడులో జనసేన పార్టీ బలం చూపుదాం..రానున్న రోజుల్లో మరిన్ని చేరికలు: గాదె

  • పౌరుషాల పురిటిగడ్డ… నాయకురాలు నాగమ్మ ఏలిన పల్నాడులో జనసేన పార్టీ దూసుకెళ్తుందని, దానికి నిదర్శనమే ఈ చేరికలని గాదె అన్నారు.

గుంటూరు జిల్లా, గురజాల నియోజవర్గం తక్కెళ్లపాడు మాజీ సర్పంచ్, సర్పంచులు జిల్లా ఫోరమ్ జిల్లా కార్యదర్శి ద్రోణాదుల అంకారావు, స్టేట్ ఎస్టి సెల్ (ఎరుకుల) ప్రెసిడెంట్ కండెల అంజి జనసేన తీర్ధం పుచ్చుకున్నారు. జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పిఏసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారని, దానికి నిదర్శనం పల్నాడు ప్రాంతం నుండి పార్టిలో చేరడం అన్నారు. గత జనవరిలో పల్నాడు ప్రాంతంలో పర్యటించానని అప్పుడు అపూర్వమైన ఘనస్వాగతం పలికారని చెప్పారు. పల్నాడు ప్రాంతంలో పార్టీ బలంగా ఉందని అప్పుడే చెప్పానని అన్నారు. క్రమశిక్షణగా ఉంటూ పార్టీ అభివృద్ధి తోడ్పడాలని. క్యాడర్ కూడా కొత్తగా వచ్చిన వారిని కలుపుకొని వెళ్లాలని సూచించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస యాదవ్ మాట్లాడుతూ… గురజాల నియోజకవర్గంలో పార్టీకి బేస్ ఉందని దానిని కాపాడుకుంటూ కొత్తవారిని పార్టీలోకి ఆహ్వానించాలని కోరారు. అందరూ కలసి కట్టుగా పనిచేయాలని కోరారు. పల్నాడు గడ్డ అంటే జనసేన అడ్డా లాగా రానున్న రోజుల్లో నియోజవర్గాన్ని తయారుచయాలని గాదె అన్నారు. పార్టీలో కొత్తగా వచ్చిన వారికి స్వాగతం పలికారు. పల్నాడు రాజకీయాల్లో కీలక మార్పులను చూస్తారని చెప్పారు. అందరూ కలసి సమిష్టిగా కార్యక్రమాలు చేయాలని చెప్పారు.

పార్టీలో చేరిన ద్రోణాదుల అంకారావు మాట్లాడుతూ… జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అశయసాధన పాలుపంచుకోవాలనే లక్ష్యంతోనే పార్టీలో జాయిన్ అయ్యానని పూర్తి సమయాన్ని పార్టీ కోసం వెచ్చిస్తానని చెప్పారు. ప్రభుత్వ ప్రజా వ్యవతిరేఖ కార్యక్రమాలపై అందరం కలిసి కట్టుగా పోరాడుతామని చెప్పారు… నియోజకవర్గ జనసేన మండల అధ్యక్షులకు, జిల్లా కార్యవర్గ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. రానున్న రోజుల్లో అనేక మంది పార్టీలో జాయిన్ అవుతారని చెప్పారు.

రాష్ట్రంలో ఎస్టీ యువత అందరూ కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రి చేయాలనే కృతనిశ్చయంతో ఉన్నారని అందుకు ప్రతీకగా నేను ఈరోజు పార్టీలో జాయిన్ అయ్యానని కండెల అంజి అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రి చేసుకునే దిశగా పనిచేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా కార్యవర్గ సభ్యులు జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.