రంగా ఆశయసాధనకు కృషి చేద్దాం

  • జనసేన ఆధ్వర్యంలో నగరంలో భారీగా రంగా వర్ధంతి కార్యక్రమాలు

గుంటూరు: ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తూ, పేద బడుగు బలహీనవర్గాల అభ్యున్నతికై తన జీవిత పర్యంతం కృషి చేసిన స్వర్గీయ వంగవీటి మోహన రంగా ఆశయ సాధనకు ప్రతీఒక్కరూ కృషి చేద్దామని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్, నగర అధ్యక్షులు నేరేళ్ళ సురేష్ అన్నారు. మంగళవారం వంగవీటి రంగా 35వ వర్ధంతి సందర్భంగా శ్రీనివాసరావుతోట, నల్లచెరువు, నెహ్రు నగర్, పెద్ద పలకలూరులోని ఆయన విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మరణం లేని ప్రజల మనిషి రంగా అంటూ కొనియాడారు. కులమతాలకతీతంగా ఎవరికి ఏ కష్టం వచ్చినా వారిని రంగా కంటికి రెప్పలా కాపాడేవారన్నారు. ఆపద వస్తే రంగా గుమ్మం తొక్కితే చాలు ప్రజలకు అండ లభించేదన్నారు. చనిపోయిన తరువాత కూడా ప్రజల హృదయాల్లో శాశ్వతంగా బ్రతికుండటం ఎలాగో రంగా జీవితాన్ని గమనిస్తే అర్ధం అవుతుందన్నారు. ఎవరన్నా చనిపోతే కొంతకాలానికి మరచిపోతామని అలాంటిది రంగా చనిపోయి నాలుగు దశాబ్దాలు అవుతున్నా రంగాని అభిమానించే వాళ్ళు ఎప్పటికప్పుడు పెరుగుతున్నారని అన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పు రత్తయ్య, జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి, నగర కార్యదర్శిలు బండారు రవీంద్ర, పావులూరి కోటి, డివిజన్ అధ్యక్షులు సయ్యద్ షర్ఫుద్దీన్, కొలసాని బాలకృష్ణ, కన్నా రాజేష్, పవన్ వెంకి, కోలా అంజి, రామిశెట్టి శ్రీనివాస్, వడ్డె సుబ్బారావు, నండూరి స్వామి, నైజామ్ బాబు, చింతకాయల సాయి, కోలా మల్లి, బాలాజీ, అలా కాసులు, బాలు, నాజర్ వలి, కరీముల్లా, మహార్షి తదితరులు పాల్గొన్నారు.