పవన్ కళ్యాణ్ గారి ఆశయం కోసం సమైక్యంగా శ్రమిద్దాం: బత్తుల
రాజానగరం నియోజకవర్గం: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో, నమ్మకంతో రాజానగరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జిగా నియమితులైన నేత బత్తుల బలరామకృష్ణను రాజానగరం మండలం, పాతతుంగపాడు గ్రామ జనశ్రేణులు మర్యాదపూర్వకంగా కలిసి, శుభాకాంక్షలు తెలియజేసి, వారు చేస్తున్న పలు సేవా కార్యక్రమాలను అభినందిస్తూ గజమాలతో సత్కరించారు. అనంతరం బత్తుల బలరామకృష్ణ పాతతుంగపాడు జనశ్రేణులకు ధన్యవాదాలు తెలుపుతూ.. మంచి సమాజ స్థాపన కోసం తపన పడుతున్న పవన్ కళ్యాణ్ గారి ఆశయం కోసం ఇకనుండి రాజానగరం నియోజకవర్గంలో మనమందరం ఒక కుటుంబంలా సమైక్యంగా పోరాడి వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించి పవన్ కళ్యాణ్ గారికి బహుమతిగా ఇద్దామన్నారు. అభినందనలు తెలిపిన వారిలో వీరమహిళలు, నాయకులు, జనసైనికులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/08/WhatsApp-Image-2023-08-01-at-9.20.29-PM-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/08/WhatsApp-Image-2023-08-01-at-9.20.30-PM-1024x646.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/08/WhatsApp-Image-2023-08-01-at-9.20.32-PM-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/08/WhatsApp-Image-2023-08-01-at-9.20.33-PM-1024x576.jpeg)