ప్రజాస్వామ్యాన్ని బ్రతికించడానికి కలసి పనిచేస్తాం: గంగారపు రాందాస్

మదనపల్లి నియోజకవర్గం: మదనపల్లి మండలం, కమ్మవీధిలో జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రాందాస్ చౌదరి ఆధ్వర్యంలో జనసేన నాయకులు కార్యకర్తలతో కలసి ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గంగారపు రాందాస్ చౌదరి మాట్లాడుతూ మొట్ట మొదటగా జనసేన పార్టీ కార్యకర్తగా, శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి అభిమానిగా, జనసేన పార్టీ లో జనసైనికునిగా ఎంతో గర్వపడుతున్నామని, ఎంతో క్లిష్టమైన పరిస్థితి వచ్చినపుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 73 సంవత్సరాల వయసులో 14 ఏళ్ల ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిని అక్రమ కేసులు పెట్టి, ఏ నేరము చేయక పోయిన తన అధికార బలంతో అరెస్ట్ చేసి జైల్లో పెట్టినపుడు, ప్రజాస్వామ్యం మనుగడకే ముప్పు ఏర్పడినపుడు ఈ రాష్ట్రనికి ప్రజలకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, చంద్రబాబు నాయిడు గారి కుటుంబ సభ్యులకి ఒక ఆత్మీయుడిగా నేను ఉన్నానని అంటూ కొంటె ధైర్యంతో ముందుకు వచ్చి నిలబడి కలబడి ఈ రోజు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు నాకోసం కాదు, మా జనసేన పార్టీ కోసమో కాదు, తెలుగుదేశం కోసమో కాదు, ఈ రాష్ట్ర ప్రజల కోసం, ప్రజాస్వామ్యాన్ని బ్రతికించడం కోసము మేము తెలుగుదేశం పార్టీతో కలసి రాబోయే ఎన్నికల్లో పనిచేస్తామని, తెలియజేసారు. జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ఒక కార్యాచరని రూపొందించుకొని ప్రజా సమస్యల పట్ల, ఈ వైసీపీ ప్రభుత్వం నియంతపు పోకడల పట్ల ఎప్పటికి అప్పుడు అందోళన కార్యక్రమాలు చేస్తామని ప్రకటించడం. మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి మాటే మాకు శిరోధార్యం, ఈ రాష్ట్రం కోసం ప్రజలకోసం పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకొన్న కూడా క్రమశిక్షణ గల జనసేన పార్టీ కార్యకర్తలుగా మేము అందరమూ కూడా మా నాయకుడు ఆజ్ఞని తుచా తప్పకుండా పాటిస్తామని అన్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి పాలన వచ్చినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం మీద విమర్శలు వ్యక్తిగత దాడులు, ప్రజా స్వామ్యం లేదు, చట్టం లేదు, ధర్మం లేదు, ప్రజలు అందరూ కూడా ఏమి అనుకుంటారో సిగ్గు, లజ్జ, మానం, హీనం అన్నీ వదిలేసి ఈ వైసీపీ ప్రభుత్వం మా నాయకుడి ని వేధించడమే కాకుండా ఈ రోజు ప్రజా ప్రతిపక్ష నాయకుడుని తీసుకొని పోయి జైల్లో వేయటం బహుశా హిట్లర్ కానీ ఔరంగజేబు కూడా ఇటువంటి ప్రోద్బలకు పోయినట్లు చరిత్రలో లేదు. కాబట్టి ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగంగా మా నాయకుడు తెలుగుదేశం పార్టీ తో కలిసి పనిచేయడానికి సిద్ధం అని చెప్పి రాబోయే ఎన్నికల్లో బీజేపీ కూడా కలుస్తుందని ఆశా బావం వ్యక్తం చేయటం మేము అంతా కూడా స్వాగతిస్తా ఉన్నాం అన్నారు. మా నాయకుడు వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ గా పిలుపుని ఇచ్చారో అదే విధంగా మదనపల్లిలో వైసీపీ విముక్త మదనపల్లి అనే నినాదం తీసుకొని ముందుకు వెళ్తాము అని, అలాగే తెలుగుదేశం పార్టీ ఇంచార్జి మాజీ శాసన సభ్యుడు దొమ్మలపాటి రమేష్, మాజీ శాసన సభ్యుడు మిత్రుడు షాజహాన్ బాషా, పెద్దలు శ్రీ రాటకొండ బాబు రెడ్డి, మేనల్లుడు బోయపాటి శ్రీనివాస్, శ్రీరామ్ చినబాబు, ఇంకా తెలుగుదేశం పార్టీ నాయకులు అందరితో కూడా కలిసి పనిచేస్తాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం, జిల్లా జాయింట్ సెక్రటరీ గజ్జల రెడ్డెప్ప, మండల అధ్యక్షులు గ్రానైట్ బాబు, రామసముద్రం మండలం ఉపాధ్యక్షులు గడ్డం లక్ష్మిపతి, ఐటీ విభాగ నాయకులు నాయని జగదీష్, కృష్ణ, నాగవేణి, లక్ష్మినారాయణ కల్లూరు, జంగాల గౌతమ్, జనార్దన్, నారాయణ స్వామి, కుమార్, చంద్రశేఖర, శంకర, అయాజ్, జాఫర్, తదితరులు పాల్గొన్నారు.